పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతరత్నాకరము

యందు పద్మమును, క్రింది చేతియందు శంఖమును, ఎడమవైపు నందలి పై చేతియందు చక్రమును, క్రింది చేతియందు గదను నున్నట్లుగా భావించి కుంభమునందును, మండలమునందును ప్రతిమయండును బూజింపవలయునని బ్రహ్మవేత్త లగువారు పలుకుదురు. అట్లు అనంతపద్మనాభస్వామిని కుంభమండప ప్రతిమలం దావాహనము చేసి దివ్యపుష్పములచేతను, ధూపదీప ముల చేతను వేఱువేఱుగా పదునాలుగువిధములైన నైవేద్య ములు చేసి, యాయనంతపద్మ నాభ స్వామికలశమునకు ముందట పదునాలుగుముళ్లు వేసిన గట్టిత్తతోరమును కుంకుమమండు తడిపియుంచి, దానిని పూజించవలెను. అట్లు పూజించిన తర్వాత నైదుపళ్ల గోధుమపిండితో బెల్లముగలిపిన యిరువదియెనిమిది యతిరసములను జేసి, చేసినవానిలో సగము బ్రాహ్మణునికి వాయన మిచ్చి దక్కినసగమును దాసు జనయిష్ట బంధువులతోడ భుజింప వలసినది. ఈ వ్రతమునందు పూజాసామగ్రులన్నియుఁ బదు నాలు గేసి యుండవలెను. ఇట్లు పూజనేసి, యనంతపద్మనాభ స్వామిని జక్కంగా ప్రార్థించి, పిదప బ్రాహ్మణులకు భోజనంబిడి, పిదప తానును సంతోషముతో భుజించి వ్రతము చేయవలెను. ప్రతిసంవత్సరమునను ఈ వ్రతనుఁను బ్రయత్నముతో చేసి ప్రతి యేటకొత్తతోకమును కట్టుకొనవలసినది. పదునాలుగ వసంవత్స రమున ఉద్యాషన చేయవలసినది” అని యాపుణ్యకాంతలు చెప్పఁగా, బుద్ధిమంతురాలగుశీల వారిసాహాయ్యముచేత వ్రతముసుచేసి, క్రొత్తతోరమును కట్టుకొని తాను దారిబత్తెమునకై తెచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణునికి వాయనమిచ్చి, తానును భర్తతోడ భుజంచి పయనమై తనయాశ్రమంబునకుఁ