పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

101 అనంత వ్రతము

బోయెను. ఆక్షణముననె ఆయనంతుని ప్రసాదమున సప్లైశ్వర్య సంపదయుఁ గలిగేను. ఆమహర్షి యాశ్రమము కలిమిగలదై కాంతితోఁగూడి, యతిథిసత్కారములచే శోభిల్లుచు శాంత మృగంబులతోఁ గూడుకొని ప్రకాశించుచుండెను. ఆశీలయు సకలభూషణములను ధరించినదై మేలిమినస్త్రమును గట్టినదై సావిత్రితో సమానురాలై యుండెను. ఆమెకలిమిని జూచి, బంధువులందఱు “అనంతపద్మనాభస్వామి యరు గ్రహముచే నీమె కింతటి కలిమి వచ్చినది" యని సంతోషముతోఁ జెప్పుకొను చుండిరి. ఆవిధముగానీ వ్రతంబుభూలోకంబున ప్రసిద్ధిఁగాంచెను.

తర్వాత నొక్కనాఁడు దుష్టబుద్ధి యగు కౌండిన్యుఁడు శీల చేతఁగట్టుకొనియున్న తోరమును జూచి, "ఓసీ! శీలా! యిదియేమి త్రాడు? ఎవరిని వశపఱచుకొనుటకై కట్టుకొన్నావు? నన్నా! లేక మఱియెవనినైననా? వాస్తవము చెప్పుము” అని శీల నడుగఁగా, “అనంతపద్మనాభస్వామిని ధరించితిని. ఆయనంత పద్మనాభుని దయవలననే మనకు ధనధాన్యములు మొదలగు సకలసంపదలు గలిగెను. ఈతోరమును కట్టుకొన్న వారికి సకల సంపదలు గలుగును గనుక నేనును గట్టుకొంటి పని చెప్పఁగా, ఆ కౌండిన్యుఁ డామాటవిని అనంతుఁడని యొక్కఁడు గలఁడా, యని యాశీలను కోపముతో ధిక్కరించి, యాతోరమును త్రెంపి ధగధగమండుచున్న నిప్పులోఁబడవైచెను. శీల హాహాకారము చేయుచుఁ బరుగెత్తి యాతోరమును ఎత్తి పాలలో వేసెను. ఆకౌండిన్యుని దుష్టకర్మ ఫలముచేత నాతనిసంపదయెల్ల నానాఁటికీ నశించెను. ఆతనిపళులను దొంగలు తోలుకొనిపోయిరి. ఇల్లు కాలిపోయెను, అతఁ డెచ్చ బచ్చటఁ బెట్టినవస్తు వచ్చటచ్చటనే