పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రతరత్నాకరము

మాయమైపోయెను. బంధువులు నిత్యము కలహింపఁ దొడఁగిరి. ఇరుగుపొరుగువారు మాటలాడుట విడిచి పెట్టిరి. ఇంట దారి ద్ర్యము తట్టుముట్టాడఁ దొడఁగెను. ఒకరైనను లక్ష్యపెట్టి. యతనితో మాటాడుట మానిరి. అంతట కౌండిన్యుఁడు మిక్కిలి. విచారము నొంది, యడవికిఁ బోయి, అనంతునే మనసునందు చింతించుచు, "ఆయనంతుని నే నేప్పుడు చూతును? అతనినిఁ జూచువఱకు నాకేమియు నక్కఱలేదు.” అని ప్రతిజ్ఞ చేసి, యాహారమును నిద్రను విడిచి కఠినమైన బ్రహ్మచర్య వ్రతంబు పూని, విచారముతోఁ గూడి నిర్మానుష్యమైన యడవిలోఁ బ్రయాణమై పోవుచుండెను. అట్లు పోవునప్పుడు ఒక మామిడి చెట్టును జూచెను. ఆచెట్టు పూవులు పూచీ పండ్లు కాయలు. గలదైయున్నను, ఒకపక్షి గాని, ఒక పురుగుగాని వాలకయుండెను. అట్టిచెట్టునుజూచి, “ఓవృక్షములలో గొప్పదానా! నీవనంతుని జూచితివా" అని యడుగఁగా, అది “నే సతఁడెవ్వఁడో యెఱుఁగనని చెప్పెను. తర్వాత బ్రాహణుండు మణికొంత దూరముపోయి, యచ్చట మోఁ కాలియంత యెత్తుగడ్డిలో నీలిచియున్నను ఆగడ్డినిదినక యీతట్టున కాతట్టునకు తిరుగుచున్న ఆవును, దానిదూడను జూచి, “మీ రనంతునిఁ జూచితిరా” యనియడుగఁగా, అది మాకుఁ దెలియదనేను. మఱి కొంత దవ్వేఁగి, పచ్చికగలబీడులో నిలఁబడియున్న యొక్క యెద్దును, పిదప తామరపువ్వులు కలువలును, తుమ్మెదలను, హంసలను, చక్రవాకపక్షులను, నీరుకోళ్లను, కొంగలుసుగలిగి శోభాయ మాసములై యొక్క దానినుండి మతొక్కదానికిఁ బొఱలు చున్న నీటితోఁగూడిన రెండుకొలకులును, వానికి వెనుక నొక గాడిదెను ఒక ఏనుఁగును జూచి, చూచినవారినెల్ల “మీరనం