పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

103 అనంత వ్రతము

తునిఁ జూచితిరా ! మీరనంతునిఁజూచితిరా” యని యడుగుచూ బోయెనుకాని, అవియన్నియు "మేము చూడలేదు. మేము చూడలే” దనియే ప్రత్యుత్తరమిచ్చుచుఁ బోయినవి. అంతట బ్రాహ్మణుఁడు మిక్కిలి యలసి, యుస్సురని నిట్టూర్పు విడిచి యొక చోటఁ గూర్చుండెను. అప్పు డనంతపద్మనాభుఁ డాభూదేవుని యందు మిక్కిలి జూలిగొని యొక ముసలి బ్రాహ్మణు నిరూపముతో వచ్చి నిలఁబడి, “యో బ్రాహ్మణో తమా! ఇటురము. నేను నీకనంతునిఁ జూపెదను.” అనిచెప్పి యాతనికుడి చేయిపట్టుకొనిపోయి, యప్సర స్త్రీలతోఁ గూడిన తనపురంబును జూపించి, యందు శంఖ చక్రములను ధరించి, గగుడునినెక్కి కూర్చుండియున్నను, ఎని మిదివిధంబులైన యైశ్వర్యములచే వెలయుచు సర్వాంతర్యా మియునై యున్న యనం పద్మనాభస్వామి రూపుండైన తన్నుఁ జూపెను. ఆకౌండిన్యుఁ డాయనంతునిఁ జూచి యెక్కువ యా సంపమునొంది యివ్విధంబున స్తోత్రముచేసెను. “ఓవైకుంఠవాసా! శ్రీవత్సలాంఛనా! నీకుఁ బలుమారు మ్రొక్కెదను. ఓ గోవిందా! ఓజనార్ధనా! ఓనారాయణా! ఓయజ్ఞపురుషా! సుజన సంరక్షకా! తమ నామస్మరణమువలన నాపాపములన్నియు నశిం చునుగాక. ప్రళయములనెడు బడ బాగ్నులుగలిగి, మోహము లనెడి పెక్కు దీవులుగలిగియున్న సంసారసముద్రమునకు తెప్పపై భక్తులను దరిచేర్చునట్టివాఁడవును, భూమిని, దిశలను, పై క్రింది లోకములను వాని ప్రమాణానుసారముగా బ్రహ్మరూపమెత్తి సృజింపుచు, విష్ణురూపమునెత్తి తాను సృజించినభూతములను గాపొడుచు, రుద్రరూపమెత్తి వానినెల్ల లయింపఁజేయుచు నివ్వి ధంబునఁ ద్రిమూర్తిస్వరూపుఁడవైయున్న నీకు నమస్కారము.