వ్రతరత్నాకరము
101 వ్రతరత్నాకరము నేనుపాపుఁడను. పాపపుఁబసులు చేయువాఁడను. పాపపు బుట్టుక ' గలవాఁడను. శరణుచొచ్చినవారిని గాపాడునట్టి యోపుండరీ కాడా! నన్ను రక్షింపుము. ఈదినమున నాజన్మము సార్థక మయ్యెను. కావుననే నామనస్సు నీపాదములందు కమలమందు తుమైన చేరియున్నట్లు చేరియున్నది. ఓదేవా! నేనిఁక మిమైన్నటి కిని మరువను.” అని యివ్విధంబున భగవంతుని స్తోత్రము చేయఁగా, భగవంతుఁడు సంతుష్టుఁడై యా బ్రాహ్మణునికి ఇహ లోకమున సంపదను, ధర్మబుద్ధిని, పరమున శాశ్వతమైన మోక్షు మును అను ఈమూఁడువరంబుల నొసఁగెను. ఆ బ్రాహ్మణుఁడు తానావరంబులను బొంది, “యోమహాత్మా ! నేను దారిలో చూచిన మామిడిచెట్టేమిటిది? యాఆవు ఏది? ఆయె దేవీ? ఆకొలఁకు లేవి? ఆగాడిదఏది? ఆయేనుఁ గేది! ఆముసలి బ్రాహ్మణుఁ డెవ్వఁడు? ఓ కేశవా! వానిసంగతియేమి చెప్పుకో" డని యడిగెను. “ఓ బ్రాహ్మణా! పూర్వజన్మమున ఒక బ్రాహ్మణుఁడు గొప్ప విద్వాంసుఁడయ్యు శిష్యులకు విద్య చెప్పక గర్వించియుండెను. గనుక, ఆతఁడడవిలో నెవరికి సుపయోగపడని యట్టి మామిడి చెట్టుగాఁ బుట్టినాఁడు. జన్మాంతరమున నొకధనికుఁడు విపులకు ఎన్నఁడుమర్యాద నేసియన్నము పెట్టినవాఁడు గాఁడుగసుక, గడ్డిలో నిలుచున్నను ఆగడ్డిని తినుటకు నోకాడని యొక ఆవుగా బుట్టి నాఁడు. తొల్లి చవిటిచేనిని బ్రాహ్మణులకు దానము చేసినయొక రాజు వృషభమైపుట్టి తిరుగుచున్నాఁడు. ఆకొలఁకులు రెండును ధరా ధర్మములు, పరనింద చేసినవాఁ డా గాడిద. పెద్దలుంచిన ధర్మపు సొత్తును అమ్మినవాఁ డాయేనుగు. నీకుఁ బడుగుగాఁ గనబడిన బ్రాహ్మణుఁడు అనంతపద్మనాభస్వామినైననేనే. ఓద్విజోత్తమా! నీ ప్రశ్నల కెల్ల ను తరమిచ్చితిని. నీవును ఈ వ్రతంబును పదునాలు నీ చ