పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంత వ్రతము

గేండ్లుచేయుము. అటుపిమ్మట 'నేను నక్షత్రస్థానము నొసఁగెదను. నీవీలోకంబున సకలసుఖంబులు ననుభవింతువుగాక" అని యనం తుఁడు వరంబోసంగి, యచ్చటనే అంతర్ధానమొందెను. తర్వాత కౌండిన్యుఁ డింటికివచ్చి, యు తమమైనయనంత వ్రత మాచరించి, యిహలోకంబున సకలసుఖంబుల ననుభవించి, వరంబున నక్షత, స్థానమును సకుటుంబముగాఁ బొంది, కల్పాంతరస్థాయియై యిప్ప టికిని నక్షత్ర మండలమునందుఁ గనఁబడుచున్నాడు. శుధర్మ నందనా! తొల్లి యగస్త్యుఁ డీవ్రతంబునాచరించి, మనుష్యలోకం బున వ్యాపింపఁజేసెను. సగరుండు, భరతుడు, దిలీపుడు, హరి శ్చంద్రమహారాజు, జనకమహారాజును.. 'మఱియు ననేకులు రాజులు ఈ వ్రతం బాచరించి రాజ్యంబుననుభవించి, స్వర్గలోకంబు నొందిరి. ఓధర్మనందనా! సకలజనులను కష్టములనుండి తొలఁ గించి కాపాడునట్టి యు త్తమ వ్రతంబును నీ కెఱిఁగించితిని. నీవురు ఈ వ్రతంబు నాచరించితివేని, నీకష్టములు తొలఁగును, ఎవరీ కథను చదువుచున్నారో, ఎవరు వినుచున్నారో, వారీలోకంబున సస్టైశ్వర్య సంపద ననుభవించి సకలపాపములఁ బాసినవారలై పరంబున నుత్తమగతిని బొందుదురు.

శ్రీభవిస్యోత్తరపురాణంబున ఆసంతవ్రతకథ సంపూర్ణము.