పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గరుడపంచమీ వ్రతము


'శుక్లాంబరధరమిత్యాదిధ్యానమ్ గణాధిపతయే నమః, ఇత్యన్తమ్ ప్రాణానాయమ్య. ఓంభూః. . . వరోమ్.మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే..., నామవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ శ్రావణమాసే శుక్ల పక్షై పఞ్చమ్యాం... వాసర నక్షత్రయుక్తాయామస్యాం శుభతిధౌ అస్మాకం సహకుటుం బానాం క్షేమ స్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం దీర్ఘసుమఙ్గలీత్వసిద్ధ్యర్థం సమస్త మఙ్గలావాప్త్యర్థం వర్షే వర్షే పూజ్యమానాం ఫణిగౌరీదేవతా ముద్దిశ్య ఫణిగౌరీ దేవతాప్రీత్యర్ధం యావచ్ఛక్తి షోడశోపచార పూజాం కరిష్యే. (కలశపూజ, గణాధిపతి పూజ, ఫణిగౌరీ ప్రాణప్రతిష్ట ఇవి యెక్కటివెంబడి నొక్కటి చేయవలయును. వీనివిధానము వినాయక వ్రతమునందుఁ జూడుఁడు.)

ఫణిగౌరీ పూజా

ఆగచ్ఛ దేవ దేవేశి శంకరార్ధశరీరిణి,
ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరి నమో౽స్తు తే.

ఫణిగౌరీ దేవతాయై ఆవాహనం సమర్పయామి.

మాణిక్యవజ్రవైడూర్యనీలరత్నాదిశోభితం,
రత్నసింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరి.

ఫణి గౌరీ. . . ఆసనం సమర్పయామి.