వరలక్ష్మీ వ్రతము
57
తా. కమలాసనమందుఁగూర్చుండినదానవు, పద్మముచేతఁ బట్టినదానవు, సకలజనులచే ముఖ్యముగాఁ గొనియాడఁబడుదానవునైన ఓ విష్ణు దేవుని రాణీ! నీవు నాయెడ నెల్లప్పుడును బ్రీతిగలిగి యుండుము. పాల్కడలియందుఁబుట్టినదానవు, దేవాసురులచే నమస్కరింపఁబడినదానవు, తామరపువ్వులందు వసించుదానపు నైన ఓలక్ష్మీ దేవీ ! నీవు మాయింట శాశ్వతముగా నుండుము. అని ధ్యానము చేయవలెమ.
సర్వమంగళమాఙ్గల్యే విష్ణువక్షస్థలాలయే,
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా.
వరలక్ష్మీ దేవతా మావాహయామి.
తా. అన్ని శుభకార్యములకు శుభంబు నొసంగుదానా! విష్ణువు ఱొమ్ముననుండుదానా! నిన్నావాహన చేయుచున్నాను. ఓ దేవీ! నాయెడం గడుఁ బ్రేమగలిగియుండుము.
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం,
సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే.
వరలక్ష్మీ దేవతాయై రత్నసింహాసనం సమర్పయామి.
తా. పదివేలసూర్యులవలెఁ బ్రకాశించుదానా! ధగధగ మెఱయురత్నములచే నలంకరింపబడిన సింహాసనమిదిగో వేయుచున్నాను. దేవతలచే పూజింపఁబడిన యోయమ్మా! కూర్చుండుము.
శుధ్దోదకం చ పాత్రస్థం గన్ధపుష్పాదిమిశ్రితం ,
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే.
వరలక్ష్మీ దేవతాయై అర్ఘ్యం సమర్పయామి.