పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరలక్ష్మీ వ్రతము


[1]ఆచమ్య. 'శుక్లాంబరధరం విష్ణు 'మిత్యాది. . . భూర్భువఃసువరోమ్. మమ ఉపాత్తసమ స్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభే...తిధౌ అస్మాకం సహకుటుమ్బానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం ఈ సత్సన్తాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం వర్షేవర్షే ప్రయుక్తాం వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తరపురాణకల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపకార పూజాం కరిష్యే, తదంగ త్వేన కలశ పూజాం కరిష్యే. (కలశ పూజ చేసి, ఆదౌ గణాధిపతిపూజాం కరిష్యే. (మొదట గణాధిపతి పూజ చేసి) వరలక్ష్మీ ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే. (వరలక్ష్మీ ప్రాణ ప్రతిష్టాపనచేసి) పూజామార భేత. (పూజ యారంభింపవలయును.)

వరలక్ష్మీ పూజా ప్రారంభము

శ్లో. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
    నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా.

    క్షీరోదార్ణవసమ్భూతే కమలే కమలాలయే,
    సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే,
                                వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి


  1. కలశపూజ. గణాధిపతి పూజ, ప్రాణ ప్రతిష్ఠాపనవిధులను గూర్చి వినాయక వ్రతారంభమునందుఁ జూచి తెలుసుకొనుడు.