58
వ్రత రత్నాకరము
తా. ఓదేవపూజితురాలా! గంధము పుష్పములు మొదలగుసువాసన ద్రవ్యములతో గూడిన శుద్ధోకముతో నర్ఘ్యము నొసఁగుచున్నాను అను గ్రహింపుము.
సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం,
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవనమస్కృతే.
వరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి.
తా. దేవతలందఱిచేఁ గొనియాడఁబడుదానా! అన్ని తీర్థములనుండి తెచ్చిన సుగంధజలముతోఁ బాద్యము నొసఁగెదను. స్వీకరింపుము.
సువర్ణకలశానీతం చన్దనాగరుసంయుతం,
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే.
వరలక్ష్మీ దేవతాయై ఆచమనీయం సమర్పయామి.
తా. శుభముల నొసఁగుదానా! బంగారుగిండ్లతోఁ దెచ్చిన చందనము, అగరు చేర్చినయుదకముతో ఆచమనీయ మొసఁగుచున్నాను.
[1]పయోదధిఘృతో పేతం శర్కరామధుసంయుతం,
పఞ్చామృతస్నానమిదం గృహాణ కమలాలయే.
వరలక్ష్మీదేవతాయై పఞ్చామృతస్నానం సమర్పయామి.
గఙ్గాజలం మయా౽నీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకస్నానమిదం గృహాణ విధుసోదరీ.
వరలక్ష్మీ దేవతాయై స్నానం సమర్పయామి.
స్నానానన్తరం ఆచమనీయం సమర్పయామి.
- ↑ పంచామృతమంత్రములను స్నాన, వస్త్ర, యజ్ఞోపవీతధూపాది మంత్రములను వినాయక వ్రతముఁ జూచి తెలిసికొనవలయును.