శత్రువులాతనిదండునంతయుఁజంపి, యతనినిఁగొట్టఁగా నతఁడోడి పరుగెతనారంభించెను. అట్లుపరుగెత్తుచుండు ఆసు కేతువు నతని భార్యనువేది వెంబడించెను. అట్లు వారిద్దలోకవనము నుండి మఱి యొకవనంబునకుఁ బోవుచు నొక్క యేకాంతమయిన యరణ్యము నడుమఁ జేరిరి. వారాహారములేక యాఁకలిదప్పులకు మిక్కిలి డస్సిరి. రాజన్ననో శత్రువుల బాణముల దెబ్బలుతీనియున్న వాఁడగుటచే రోగములలోఁ జిక్కి నడువ లేక పోయెను. అంతనాసు వేది తనయాఁకలిదప్పుల కే కాళ, తనభర్తయొక్క యవస్థకును. మిక్కిలి విచారపడినదై, తనమగనిని తన భుజములమీఁద నెక్కించు కొని, ఒకవనమునుండి మఱియొక వనంబునకుఁ బోవుచుండెను. ఆ ప్రకారము సువేది పోవునపు డాంగీర సమహామునియెదురపడెను. ఆసువేది యమ్మునినిఁ జూచి వెక్కి వెక్కి యేడ్చెను. ఆయాంగి రసమహాముని యాసువేదిని జూచి 'అమాయీ! దుఃఖపడకుము. నీకు మేలయ్యెఁడు. మీరలెవ్వరు? ఏల బహుదుఃఖములలోఁబడి యున్నారు? మీ రాజ్యమేది? మీ బంధువులు ఎచ్చట సున్నారు ? ఏల యాకఁలితోఁగష్టపడుచున్నా' రని యడుగఁగా, సువేది, తనమగండు శత్రువులతో యుద్ధముచేసి యందోడి యడవులకు వచ్చి రోగములలోఁబడి నడువ లేకపోఁగాఁ దానిట్లు మగనిని మోసుకొని పోవుచున్నట్లు చెప్పి తనకష్టము దొలఁగి సుఖపడఁ దగినయుపాయముఁ దెలువఁగోరెను. ఆంగీరసుఁడును, 'ఓసు'వేదీ ? పంచవటీనదీతీరమునకు నాతోఁగూడ రమ్ము. అచ్చట దుర్గాదేవళ మున్నది. ఆదుర్గాదేవిని బూజించినట్లైన, మీకు పుత్రపౌత్రాదీ సంపదలును, రాజ్యమును, మహదైశ్వర్యమును గలుగునని చెప్పఁ గా, సంవేదియు నచ్చటికిఁ బోఁదలఁచి, భ రనుమోసికొని బహు దూరముపోయి, యాపంచవటినది యొడ్డు చేరి భర్తతోఁగూడ
పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/55
Appearance