Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సరస్వతీ వ్రతకథ

సరస్వతీ వ్రతకథ ఒకానొకప్పుడు సూతమహాముని శౌనకాదిమునీంద్రులను చీ యిట్లనియె: “ఓ మునులారా ! మీ రందఱు వినుఁడు. 'దుర్గా లక్ష్మీ సరస్వతీపూజ యసు వ్రతములలో నుత్తమ వ్రతం బొక్కటి కలదు. ఆవ్రతముయొక్క విధానంబు నెఱిఁగించెదను. వినుఁడు. ఆశ్వయుజశుద్ధపాడ్యమి మొదలీ వ్రతంబును తొమ్మిది దినములు చేయవలయును. లేదేని మూలానక్ష త్ర మునాఁటినుండి యైనను జేయవలెను. దానికి శక్తిలేనివాఁడు మహానవమినాఁ డైనను జేయవలెను. ఈ వ్రతంబు నాచరించుమానవుఁడు శాశ్వత సంపదతోఁ గూడిన వాఁడై యుండి, యీ దేహంబు విడిచినపిమ్మట దుర్గా దేవియొక్క లోకంబును జెందుచున్నాఁడు.” సూతుఁడు ఋషులతోఁజెప్పఁగా, వా రమునిపుంగవునిఁ జూచి, "ఓమహాత్మా తొల్లి యీ వ్రతంబు నెవ్వ రాచరించిరి? ఎవరికి దీని వలన గొప్పసుఖంబు గలిగెను? ఆనతిం”డని యడుగఁగా సూత మహాముని వారితో నిట్లనియె. “ఓఋషులారా! మీరు సావధాన ముగా వినుఁడు. ఆవ్రతమహిమను మీకుఁ దెలియఁజెప్పెదను. తొల్లి కృతయుగంబున సుకేతువను రాజొకఁ డుండెను. అతఁడు పుణ్యాతుఁడు. జనులను న్యాయముతోఁ బాలించువాఁడు. ఎడ తెగ నికలిమితో ఁగూడినవాఁడు. చతురంగ బలసమృద్ధిగలవాఁడు. అతనికి విఱివిగలకన్నులుగలదియు, వయసుగలదియు, సకలశుభ కార్యములఁ జేయునదియునైనను వేది యనుభార్యగలదు. ఆసతి వ్రత యాతనికిఁ దగినదై యుండును. ఆతని రాజ్యమున గ్రామము, చోరభయము లేకయుండెను. అట్లు అతఁడు రాజ్యమేలుచుం డఁగా నాతనిసామంత రాజులకు ఆతనిమీఁద ఓర్వలేమిపుట్టెను. ఆసంగతి సుకేతు వెఱిఁగి, వారిపైకి యుద్ధమునకుఁ బోయెను. ఆ