39
సరస్వతీ వ్రతము
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైకపూజితే,
మయా కృతామిమాం పూజాం గృహాణ జగదీశ్వరి.
సరస్వతీమావాహయామి
జగముల నేలునట్టియు, జనులచేఁ గొనియాడంబడు ఓతల్లీ!
యిచ్చటికి విజయము చేసి నేనొనర్చుపూజను గైకొనుము.
అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం,
ముక్తామణ్యఞ్చితం చారు చాసనం తే దదామ్యహమ్.
సరస్వత్యై ఆసనం సమర్పయామి.
ఓ సరస్వతీ! రతనాలు చెక్కి ముత్యాలసరంబులు గట్టిన
బంగారపుసింహాసనము నొసఁగెదను అనుగ్రహింపుము.
గన్ధ పుష్పాక్ష తైః సార్ధం శుద్ధతోయేన సంయుతం,
శుద్ధస్ఫటిక తుల్యాఞ్గి పాద్యం తే ప్రతిగృహ్యతామ్.
సరస్వత్యై పాద్యం సమర్పయామి
ఓస్ఫటికమువలెఁ దెల్లనైన మేనుగల దేవీ! గంధపుష్పా
క్షతలు చేర్చిన పరిశుద్ధజలముచేఁ బాద్య మొసఁగెదను. స్వీక
రింపుము.
భక్తాభీష్టప్రదే దేవి దేవదేవాదివన్దితే,
ధాతృప్రియే జగద్ధాత్రి దాదామ్యర్థ్యం గృహాణ మే.
సరస్వత్యై నమః అర్ఘ్యం సమర్పయామి
భక్తుల కోరికల నిచ్చుదానా ! ఇంద్రుఁడు మొదలగు దేవ
తలచేఁ గొనియాడఁ బడుదానా ! లోకరక్షకురాలా! బ్రహ్మ
దేవునిరాణీ!'నే నిచ్చు ఆర్ఘ్యమును స్వీకరింపుము.