Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వ్రతరత్నాకరము

పూర్ణచన్ద్ర సమానా భే కోటిసూర్యసమప్రభే,
భక్త్యా సమర్పితం వాణి గృహాణాచమనీయకమ్.

సరస్వత్యై నమః ఆచమనీయం సమర్పయామి.

పున్నమచంద్రునివలెను, కోటిసూర్యులవలెను బ్రకాశించు ఓదేవీ! నేను భక్తితో నొసఁగు ఆచమనీయమును గ్రహింపుము.

కమలభువనజాయే కోటిసూర్యప్రకాశే, విశదశుచివిలాసే
కోమలే హారయుక్తే, దధిమధుఘృతయుక్తం క్షీరరమ్భా
ఫలాఢ్యం, సురుచిరమధుపర్కం గృహ్యతాం దేవవన్ద్యే.

సరస్వత్యై మధుపర్కం సమర్పయామి

కోటిసూర్యులవంటి కాంతిగలదానవు, శుభ్రమైనచిఱునగవు గలదానవు, హారములఁ దాల్చినదానవు, దేవతలచేఁ గొనియాడఁబడుదానవునైన యోబ్రహ్మపత్నీ! పెరుగు,తేనె, పాలు, అరఁటిపండ్లు గలిపిన మధుపర్కము నొసఁగెనను గ్రహింపుము.

[1] దధిక్షీరఘృతో పేతం శర్క రామధుసంయుతం,
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ మహేళ్వరి.

సరస్వత్యై పఞ్చమృతస్నానం సమర్పయామి

శుద్ధోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం,
సువర్ణ కలశానీ తైర్నా నాగస్ధసువాసితైః

సరస్వతీం స్నాపయామి


  1. *పంచామృతము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము మొదలగు వానికిగాను వలయు మంత్రములను (వినాయక వ్రతమునందు) చూడవలయును.