38
వ్రతరత్నాకరము
కృతేన దర్పణాభేన వస్త్రేణోపరి భూషితాం, సుస్తనీం వేదవేద్యాం చ చన్ద్రార్ధకృతశేఖరామ్, జటాకలాపసంయుక్తాం పూర్ణచన్ద్రనిభాననాం, త్రిలోచనాం మహాదేవీం స్వర్ణనూపురథారిణీమ్. కటకైః స్వర్ణరత్నాథ్యైర్ముక్తావలయభూషితాం,కమ్బు కణ్ఠీం సుతామ్రోష్ఠీం సర్వాభరణభూషితామ్.కేయూరైర్మేఖలా ద్యైశ్చ ద్యోతయన్తీం జగత్రయం, శబ్దబ్రహ్మాత్మికాం దేవీంథ్యానకర్మసమాహితః.
సరస్వత్యై నమః ధ్యాయామి.
(సరస్వతి పుస్తకములందు సర్వదా క్రీడించుచుండునుగావున జితే ద్రియుఁడయినపురుషార్థములఁ గోరునతఁడుకములందే ధ్యానావాహనాది పూజలం జేయవలయును) ఓం కారరూప మగుపీఠమునఁ గూర్చుండునదియు, ఆఓంకారార్థమని నిర్ణయింపఁబడినదియు, 'అంకుశము, జపమాల, పాశము, వీణను ధరించునదియు, ముత్యాలసరములను దాల్చినదియు, సంతోష స్వరూపురాలును, చక్కగా నేయబడిన యద్దము, బోలెడి వెలిపట్టుబట్టను గట్టినదియు, సుస్తనియు 'వేదములచే నెఱుఁగఁ దగినదియు, అర్ధ చంద్రుని శిరస్సునందుఁ దాల్చినదియు, జడలగుంపుతో వెలయునదియు, నిండుచంద్రుని బోలు మోముగలదియు, మూడుకన్నులు గలదియు, దేవతలలో నెక్కువయినదియు, బంగారపుటందెలు, రవలు చెక్కిన చేతి గాజులు,ఓడ్యాణము, వంకీలు మొదలగు సకలభూషణంబులఁ దాల్చి నదియు, ఎఱ్ఱనిమోవియు, శంఖమువంటి మెడయుఁ గలదియు,తనభూషణముల మెఱుఁగుచే ముల్లోకంబులను వెలుఁగఁజేయు నదియునైన శబ్దబ్రహ్మస్వరూపిణి యగుసరస్వతీ దేవిని ధ్యానించుచున్నాను.