Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము

కేదా రేశ్వర వ్రతము 148 యైశ్వర్యమదముచే మై మఱచినదై, యాకేదా రేశ్వర వ్రతంబు నుల్లంఘనము చేసెను. అది కారణంబుగా నాభాగ్యవతిని కొడు కుతోఁగూడ దానిభ ర్త యొక కారణంబుచే రాజ్యమునుండి తఱిమెను. a అంతట నా భాగ్యవతి తనపిల్ల వానితోడ నడవు లెల్ల దిరిగి మిగులడస్సీ, కడపట నొకబోయవానియిల్లు జేరి, తనకొడుకును బిలిచి, “నాయనా ? యీయుజ్జయినీ రాజుభార్య నాకక్క గావలెను. కావునఁ బెతల్లికడకుఁ బోయి, మనసంగతి యెఱిఁగించి, ధనముఁ గొనికమ్మని చెప్పిపంపెను. ఆబాలుఁడును ఉజ్జయినికే తన పె తల్లి యగుపుణ్యవతికిఁ దనతల్లి రాజ్యమునుండి తఱుమ గొట్టఁబడి యదువులం ఏడుమలుపడుచుండుట చెప్పి యామె యిచ్చిన విస్తారధనంబును గైకొని వచ్చుచుండెను. దారిలోఁ గేదారేశ్వరుఁడు దొంగవలె వచ్చి యాధనము నపహరించుకొని పోయెను. మఱల సబ్బాలుఁడు వెనుకకుఁ బోయి, తాపడిన తం టాలు చెప్పి, మఱలసొముగొనివచ్చుచుండఁగా కేదారేశ్వరుఁడు ముందటివలె నతనికిఁ గనఁబడకవచ్చి సొముదోఁచుకొని, చీనుఁ డైన యాబాలునిఁ జూచి 'ఓభాగ్యవతీపుత్రుఁడా! వ్యసనంబు నొందకుము. నా వ్రతంబు సుల్లంఘించినవారి కీధనంబు దగదు' అనిచెప్పెను, అంత నా బాలుఁడు, బుణ్యవతి కీవృత్తాంతంబుసు జెప్పెను. అంతటఁ బుణ్యవతి యాబాలునిచే నా వ్రతంబు చేయించి, అబ్బాయీ! తల్లి చేత నీనోము నోమించుమని చెప్పి వానికిఁ గావలసిన ధనం బొసఁగి పంపెను. అంతట నాబాలుఁ డాధనంబుసు గైకొనివచ్చుచుండఁగా, ముందు దాసుబోఁగొట్టినధనమంతయు దారిలోఁ బడియుండెను