వ్రతరత్నాకరము
డను గంధర్వుడు నందికేశ్వరుని యనుగ్రహము బడసినవాఁడై తాను భూలోకంబున నీవ్రతంబును బ్రచారంబు చేయ నెంచిన వాఁడై యుజ్జయినీపట్టణమునకు వచ్చి “ఓనాథా! కేదారనాథ వ్రతంబు సల్పితివేని, నీకు సకలసంపదలు గలుగు” నని వజ్రదంతుఁడను యుజ్జయినీ దేశపురాజున కెఱింగించెను. ఆవజ్రదంతుఁ డీ ప్రతంబు నాచరించి దేశముల కెల్లఁ బ్రభువాయెను. ఆపట్టణమున నిద్దఱు వైశ్యకన్యక లుండిరి. 'వారు తమతండ్రి కడకు వచ్చి నాయనా! మేము కేదారేశ్వర వ్రతంబు సేయ నెంచియున్నాము. మా కొనతిమని యడిగిరి. దానికి, తండ్రి, "పిల్లలారా! నేను దరి ద్రుఁడను, మీరాతలంపు మానుకొండు” అని చెప్పెను. అంత నాకన్యకలు “నాయనా! నీవేమి యియ్యనక్కరలేదు. నీవు త్తరు విచ్ఛినయెడలఁ జాలుసు” యని యడిగిరి. ఆ ప్రకారమే తండ్రియు తకనిచ్చెన తర్వాత వారి భక్తికి మెచ్చి, ఈశ్వరుఁడు తానే వారికీఁగావలసిన వస్తువులు దొంకునట్లు ప్రసాదించెను. అంత వాకలిద్దఱు నొకపట్టి చెట్టు క్రిందికిఁ బోయి మొదట కంకణము కట్టుకోని యీ వ్రతంబును యథావిధిగా నాచరించిరి. అంతట మహాదేవుఁడు కడుఃసప్పొంగి, వారికి సురూపంబుసు, దీర్ఘ జీవితంబును, తరుగనికలిమిని నొసఁగి యంతర్ధానము నొందెను. ఆయిద్దఱక్క సెలైండ్రలోఁ బెద్దనగుపుణ్యవతి నుజ్జయినీగాజు పెండ్లాడెను. మతొక్కతె యగు’భాగ్యవతిని చోళ దేశపురాజు పెండ్లాడెను. ఆవైశ్యుడును తనకొమార్తెలను రాజుల కిచ్చుటచే మిక్కిలి కలిమినొంది సుఖంబుండెను. ఆయిద్దఱు వైశ్యపుత్రికలును సామ్రాజ్యమును సంపును మహాబలులగు కొడుకులను బడసి సుఖంబుండిరి. తర్వాతఁ గొంతకాలమునకు భాగ్యవతి