పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము

నాయిరువదియొక్క మంది. బ్రాహ్మణులను బూజింపవలెను. తర్వాత కలశమునందు కేదార దేవుని నావాహనము చేసి, చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాదులతోను, గంధపుష్ప అక్షతలతోను, నానావిధవస్త్రములతోను బూజించి, ధూపదీపంబు లొసఁగి, గోధుమపిండితోఁజేసి నేతిలోఁ గాల్చిన యిరువది యొక్క యతీరసములను, పాయసమును, పాలు, పెరుఁగు, నెయ్యి, తేనె మొదలగు వానితో నిండిన సకలవిధశాకంబులను, పలు తెఱఁగులైన యకఁటి మామిడి కిచ్చిలి మొదలగు పండ్లను నివేదననేసి, తాంబూల నీరాజనమంత్రపుష్పములొసఁగి, కేదారనాథుని బలువిధంబుల స్తోత్రములు సల్పి పూజయైన పిదప బ్రాహ్మణుల కందఱికి భూరిదక్షిణాతాంబూలము లొసఁగి వ్రతంబు పూర్తినేసి యాకేదారేశ్వరుని సంతోషపెట్టుము. అంతటఁబక మేళుఁడు వేల్పులందరితోఁ గూడ వచ్చి నీకు స్వదేహములో నర్ధాంశము నొసఁగునని చెప్పెను.

అంతటఁ బాక్వతి మునీంద్రుఁడు చెప్పిన చొప్పున బహుభక్తితో నా కేదా రేశ్వర వ్రతంబు నాచరించెను. తర్వాత భగవంతుఁడగు వృషధ్వజుఁడు వేల్పుగుములతోడఁ బ్రత్యక్షమై పార్వతికిఁ దనదేహములో సగముభాగము నొసఁగెను, తర్వాత పాన్వతి మిక్కిలి సంతోషపడి, యీశ్వరుని యర్ధశరీకమును బొంది, లోకుల మేలుగోరి యీశ్వరుని సంతోషపరచి కేదారేశ్వరుని యనుగ్రహంబువలనఁ గోరిన కోర్కెలెల్ల భక్తుల కొసఁగు నట్లు శరంబుగోరెను. పరమేశ్వరుఁడును అట్లే కలుగును గాక యని యనుగ్రహించి, వేల్పులందరితోఁ గూడి యంతర్ధానము నొందెను. అప్పు డచ్చటనుండిన శివభక్తుఁడయిన చిత్రాంగదుఁ