140 వ్రతరత్నాకరము
పార్వతీదేవి నడిగెను. ఆపార్వతి తన విచారంబుసకుఁ గారణం బెరింగించి యాతనినిఁ గూర్చుండఁ జేసి “ఓభగవంతుఁడా! సకల యోగులు పూజించెడి యీశ్వరుని యర్ధాంగము నాకెట్లు సిద్ధించునో, యట్టివ్రత మొక్కటి యానతి మని యడిగెను. అంతట గౌతమమహాముని సకల శాస్త్రములను పురాణములను బరికించి, "కోరిన కోర్కుల నొసఁగు కేదారేశ్వర వ్రతంబు “నాచరింపుము. నీకోరిక సిద్ధించు”నని చెప్పెను. ఆపార్వతీ ముని పలుకులు విని, “ఓమహాత్మా! ఆ వ్రతంబు సేయుట యెట్లు? శాస్త్రవిధానంబు నెఱింగింపుము.” అని యడుగఁగా, నాగౌతమ మఃనీంద్రుఁ డాపార్వతీదేవి కిట్లనెను. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాఁడు మానవుఁడు పరిశుద్ధుఁడై తెల్ల పట్టువికాని లేక నూలు పోఁగుని కాని యిరువదియొక్క పేటలనూలిని జేతికి కంకణము కట్టుకొనవలయును. ఆరాత్రి యుపవాసముండి బ్రాహ్మణభోజనంబు చేయింపవలెను.ఆది మొద లమావాస్య వఱకుఁ బ్రతిదినమును కేదారనాథుని బూజచేయవలయును.
ఆవ్రతంబు సేయువిధం బెట్లనినః ప్రతిదిన ముదయమున
లేచి పరిశుద్ధమై విజనమైయుండు స్థలంబున ధాన్యమును రాశి
పోసి దానిమీఁద నొక పూర్ణకుంభము నునిచి, దాని నిరువదియొక నూబిపోగులతోఁ జుట్టి దానిమీఁద తెల్లని బట్టు బట్టగాని, లేక మజేవస్త్రముసుగాని చుట్టి, నవరత్నములను
గాని, బంగారమునుగాని, వెండినిగాని దానియందుంచి, గంధ పుష్పాక్షతాదులతో నాకలశంబును పూజించి, యావల నిరువది యొక్క మంది బ్రాహ్మణులను బిలిచి, కాళ్లు కడిగి పీఁటలమీఁదఁ
గూర్చుండఁ బెట్టి, పురోహితునికి ముందుగాఁ బూజనేసి, పిమ్మట