పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము 139

దేవిని విడిచి, పరమశివునికి మాత్రము ప్రదక్షిణము గావించి నమస్కరించెను. అప్పుడు పార్వతి తననాథునిఁజూచి "యీభృంగి. రిటి నన్ను వదలిపెట్టి నీకు మాత్రము ప్రదక్షిణంబు గావించినాఁ డందుకేమి కారణం" బని యడుగఁగా శశిశేఖరుఁడును "ఓప్రియా! బ్రహ్మము నెఱిఁగిన యోగులు నిన్ను మ్రొక్కరు. వారికి నీవలనఁ బని లేదు. అని పార్వతికిఁ జెప్పెను.

ఇట్లు పరమశివుఁడు చెప్పఁగా బాక్వతి తన ప్రియుని మీఁది కోపముచే నతనిని బాసి తసశక్తి నాకర్షింపఁగా, పరమేశ్వరుఁడును ప్రియావియోగముచే జికీపోయెను, అంబికయు స్త్రీ యవియోగముచే మిక్కిలి చిక్కి, దేవతలు వేడు కొనుచున్నను, శాంతినొందక కైలాసము విడిచి, యొండొంటి, మీఁద పగలేని' సింహవ్యాఘ్రమృగంబులతోఁ గూడినదియు, మహర్షులు కునికిపట్టును, జనులకందఱకుఁ బ్రీతికరమై యన్ని కోర్కుల నొసఁగునదియు నైన గౌతమవనంబునకుఁ బోయి నేరెను. ఎక్కువ బ్రహ్మతేజస్సుగల గౌతమమహాముని వనంబునఁ బెరుగు హోమయోగ్యము లగుసమిధలను, దర్భలను బండ్లను గైకొనివచ్చుటకై వనాంతరములకుఁ బోయియుండెను. తర్వాత నమ్మహర్షి కావలసిన వస్తువులను గైకొని ములి, తన యాశ్రమము చేరువకు వచ్చి, “ఏమి యీవింత! ఈతపస్సుల యాశ్రమంబు ఆ కాలమున మిక్కిలి శోభిల్లుచున్నది. కారణ మేమైయుండవచ్చును" అని యాలోచించుచు, తపోవనంబులోపలఁ బ్రవేశించి, కమలంబులంబోలు పాక్వతం జూచి యతిథిపూజ నేసి యాగమన కారణం బేమని కన్నులుగల