వ్రతరత్నాకరము
యగుపరమశివుఁడు ప్రమథగణంబులు చుట్టు గొల్వుగొల్చు. చుండఁగాఁ భార్వతీసమేతుఁడై, దేవతల కందఱకు దర్శనం. బొసఁగెను. అప్పుడు అగ్ని వాయు సూర్యచం. ద్రాదు లగుసకల దేవతలును, వసిష్ఠుఁడు మొదలగు సకలఋషులును, బ్రాహ్మి మొదలగు అష్టసిద్ధులును, రంభ, తిలోత్తమ, మేనక మొదలగు దేవ కాంతలును, చండిక మొదలగు సప్తమాతలును, వినాయకుఁ డును, కుమారస్వామియు, నందుఁడు మొదలగు ప్రమథగణంబు. లును సారూప్యము నొందియుండిరి. అప్పు డాసభయందుఁ బరమేశ్వరుని ప్రేరణంబున నారదుఁడు మొదలగు ఋషులు గానంబు చేసిరి. ఆఋషులు సకల శ్రావ్యముగా గానంబుచేయు చుండఁగా, వారిగానములకుఁ దగినట్లు వాద్యములు వాయించుచు, తాళములు వేయుచు, రంభాదులగు అప్సరసలు నాట్యంబు సల్పిరి.
వారందఱిలోపలఁ గడుచక్కనిదైనరంభ మిక్కిలి వినోదముగా నాట్యము సల్పి యీశ్వరునికిఁ బరమసంతోషమును గలిగించెను. అప్పుడు భృంగిరిటి యను ప్రమథుఁడు శివుని యనుమతి వడసి, యప్పరమశీవునికిని, సకల దేవతలకును నవ్వుపుట్టునట్లు. పార్వతీపరమశివుల ముందట హాస్యము చేసెను. ఆహాస్యమును చూచి దేవతలందఱు పర్వతగుహలు మాఱు మ్రోగునట్లు కడుపు. లుబ్బునట్లు నవ్విరి. ఆ ప్రహసనము ముగిసినతర్వాత పరమశివుఁడు. తన భక్తునిఁ జూచి, ఓభృంగిరిటీ! బాగుగా హాస్యము చేసితివి. నీ ప్రహసనమునకు మిక్కిలి యానందించితినని యాభృంగిరిటిపై మిక్కిలి ప్రేమగలవాఁ డయ్యెను. అంతట నాభృంగిరిటి శివుని యొక్క యు, దేవతల యొక్కయు మన్ననలను బడిసి, పార్వతీ