కేదారేశ్వర వ్రతము
గ్రహముచేత సృజింపఁబడినదో, అట్టిభగవంతునిఁ బార్వతీశ్వరుని నమస్కరించి, సకల సంపదలును నొసఁగునట్టిదియు, తొల్లి యనేకమునులచే నాచరింపఁబడినదియు నైన కేదార వ్రతము యొక్క మహిమను లోకముల క్షేమాభివృద్ధిఁ గోరి చెప్పు చున్నాను వినుఁడు. తొల్లి పార్వతీ దేవీ యీ వ్రతము నాచరించి, సకలసంపదలను బొందెను. ఈ వ్రతంబు నాచరించువారికిని, ఈ వ్రతమహిమ విన్న వారికిని ఆయురారోగ్య సంపత్కీర్తులు గలుగుచున్నవి. ఈయు తమ వ్రతం తంబు నేమానవుఁ డఱువదియొక్క పర్యాయములు చేయుచున్నాఁడో, వాఁడు ఇహంబున గొప్ప యదృష్టమును, కాంతిని, ఆయుస్సును కలవాఁడై యుండి, పరలోకంబున శివసాయుజ్యము నొందుచున్నాఁడు. కావున నాలుగువర్ణంబుల వారును నియమముతోఁ గూడినవారై ఈ వ్రతంబు నాచరింపవలయును.
వ్రతకథాక్రమం బెట్లనిన :
భూలోకంబున ఈశాన్యమూలయందు కైలాసం బనెకి పర్వతం బొక్కటి కలదు. ఆపర్వతంబున మెఱుపులతోఁగూడిన శరత్కాలమేఘంబులో యనఁదగి సకలరత్నములతో గూడిన తెల్లని వెండిశిఖరములు వెలుఁగుచుండును. సాలతమాలహింతాల వకుళాశోక కరకనింబచందన దేవదారుపనసామ్రపూగపున్నాగ చంపక ప్రముఖ నానావిధ పుష్ప ఫలభరితనృక్షములతోఁగూడి, పలు తెఱంగులగు పులుఁగులకూఁతలును, పలువిధంబులగు నెలయేళ్లును గలిగియుండును. యోగులెల్లరు నాపక్వతశిఖరమున నుందురు. అచ్చటనే యక్షకిన్నరగంధర్వసిద్ధిచారణవిద్యాధరులు వాసము చేయుచుందురు. ఆరమ్యమైన పర్వతశ్రేష్ఠమున సర్వవ్యాపి