Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వ్రతకర్నాకరము

కరించి ఆమంటమున మ్రుగ్గులుపెట్టి యామంటకమునడుమ దివ్యమైన యాసనంబు నమర్చి దానిమీఁద బియ్యముపోసి,పూవు లక్షతలుచల్లి, శక్తివంచన లేకుండ బంగారుతోఁగాని,వెండితోఁగాని, రాగితోఁగాని తుదకు మంటితోగాని ఆదిశేషుని ప్రతిమ నొకదానిని జేయించి దానిమీాఁద బెట్టి యా ప్రతిమ యందు గౌరీదేవి నావాహనము చేసి, ఆసనాఘ్యపాద్యాచమనీయస్నాన వస్త్ర, యజ్ఞోపవీత గంధపుష్పాక్షతాభరణాలంకార ధూపదీపనైవేద్యతాంబూల నీరాజన మంత్రపుష్పాదు లగు సకలపూజలను గావించి, ప్రదక్షిణ నమస్కారములు సల్పి,దోర పూజసేసి దోరము గట్టుకొని వృద్ధ బ్రాహ్మణునికి వాయనం బొసఁగి సకల బ్రాహ్మణులకు సంతర్పణంబు గావించి, తాను తన యిష్టబంధుజన సమేతముగా భుజియించి, వ్రతమును పూర్తిచేయవలెను. ఏసుదతి యీ వ్రతంబును బదిసంవత్సవములు విడువక చేయుచున్నదో ఆసుమంగలి యిహలోకంబున సకల సౌఖ్యంబుల ననుభవించి, యంతమున మోక్షసామ్రాజ్యము నొండఁగలదు"అని సూతమహాముని చెప్పఁగా, శౌనకాది మునీంద్రులు వెండియు న మ్మునీంద్రుని జూచి, “ఓమునీంద్రా! మేము గరుత్మంతుని జననము, కార్యములు, వీర్యమునుగూర్చి వినఁ గోరుచున్నాము: సెల వి"మ్మని యడుగఁగా, సూతపౌరాణికుడు ఆగరుడుని జననాదులనుగూర్చి వారి కిత్తెఱగున 'నెఱిఁగించె. “ఓమునులారా ! తొల్లి బ్రహపుత్రుఁడయిన కాశ్యపుఁడనెడి పేరుగల యొకమహర్షి యుండెను.ఆయనకు సుపర్ణి యను భార్య యొక్క తే యుండెను. ఆయన కాసుపర్ణియందు గరుత్మంతుఁ డనెడియొకకొమరుఁడు పుట్టెను. అతఁడు మితి మీఱిన