గరుడపంచమీవ్రతము
115
పఞ్చమ్యాం జాయమానత్వాతృఞ్చమిా తార్క్ష్యపంచమీ.
26.యే చరన్తి వ్రతమిదం యే పఠన్తి ద్విజాతయః, తే తు పాప వినిర్ముక్తా యాస్యన్తి పరమాం గతిమ్. 27.ఇతి గరుడ పఞ్చమి వ్రతకథా సమ్పూర్ణా,
__________
గరుడపంచమిా వ్రతకథ
సూతుడు శౌనకాది మహామునుల నందఱిని జూచి, “మునీంద్రులారా ! అనుష్ఠించినమాత్రముననే స్త్రీలకు సకల సంపదల నొసఁగునట్టి వ్రతములలో నెల్ల సుత్తమం బగువ్రతం బొక్కటి గలదు. ఈపంచమిా వ్రతంబును తొఁడబుట్టువులుగల సుమంగలి శ్రావణశుద్ధపంచమిదినంబునఁ జేయవలెను”
అని చెప్పఁగా శౌనకమహాముని సూతపౌరాణికునిఁజూచి, “ఓమహాపండితుడా!వ్రతంబులలో నెయ్యది యుత్తమ వ్రతమో, ఆ వ్రతంబు నా కానతిండు. నేను వినగోరుచున్నాను. అట్టి వ్రతంబు నాకెఱిఁగింపవలయు” నని వేఁడఁగా సూతపౌరాణికుఁడు శౌనకాది మహామునులతో నిట్లనియె.
“ఓమునీంద్రులారా! యీ వ్రతంబు నేసుమంగలియైనను జేయవచ్చును. అయినను ముఖ్యముగా నన్న దమ్ములుగల యాడుది తప్పక యీవ్రతంబు నాచరింపవలయును. అట్టి కాంత శ్రావణశుద్ధ పంచమిరాఁగానే యుదయమున లేచి, పసుపు సువాసనగల నలుఁగుఁబిండి మొదలగు సువాసన గలపోళ్లను చేహము నకు రుద్దికొని మంగళస్నానము చేసి, యుదికినమడిబట్టలను గట్టుకొని, మండపము పండ్లు ఆకులు మొదలగువానితో నలం