పుట:వెలుగోటివారి వంశావళి.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

వెలుగోటివారివంశావళి


ఉ.

ఒక్కఁడు జారముఖ్యుఁ డొకఁ డూఱక రాఁజుఁ[1] బరేతపాలకుం[2]
డొక్కఁ డొకండు రాత్రిచరుఁ డొక్కఁడు చాలజడుండు చంచలుం
డొక్కఁ డొకం డసభ్యుఁడగు[3] నొక్కఁడు భిక్షుకుఁ డేటిదిక్పతుల్
దిక్కుల కన్నవోత[4]జగతీతలనాథుఁడె దిక్కు[5] మేదినిన్.

92


సీ.

గొరిజరాయిడిచేతఁ గుందిన దేహంబు
        పరిరంభణంబులం బదిల పఱచి
విసపుఁగోఱలచేత వేఁగిన యధరంబు
        చుంబనక్రీడల చొరవఁ జూపి
మదఘీంకృతులచేత బెదరు పుట్టిన చెవుల్
        దియ్యంపుమాటలఁ దీపు నెఱపి
కర్కశస్పర్శలఁ గందిన పాలిండ్లు
        చిన్ని చేపిడికిళ్ల చెలు వొనర్చి
పంది నదలించి[6] చాతురి[7] పాము డించి
యేనుఁగుల నెక్కి[8] తాఁబేటి ఱేనిఁ ద్రొక్కి[9]
వసుధ నీమూఁపుప్రాపున నెసఁగె[10] నౌర
యన్నవోతాంక ఖడ్గనారాయణాంక.

93


సీ.

పాతాళఫణిసార్వభౌముని పడగలుఁ
        గకుబంతమదగంధకరులు సాటి
కకుబంతమదగంధకరితల్లజంబులుఁ
        గలశాబ్ధికల్లోలఘటలు సాటి

  1. V.V.C. p 42 రోజు
  2. V.V.C.; A. B. పదైకపారగుం
  3. A. B. యభ్యసుడు వొక్కడు , V.V.C p18 యక్షఘనుఁ డొక్కఁడు
  4. A.B. and V.V.C. p 42 దిక్కులనన్నవోత
  5. V.V.C. p42 దక్క
  6. A పందినదండించి; B పందినదడించి
  7. A.B. చాతరి
  8. A B. పిక్కి
  9. A.B. దక్కి
  10. A.B. నొసంగె నౌర