పుట:వెలుగోటివారి వంశావళి.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

33


క.

లావున సింగయమాధవు
వావిరి మార్కొన్న శత్రువర్గము కెల్లన్[1]
భావింప[2] మూఁడు త్రోవలు
చా వొండెను బాఱు టొండె[3] శర ణను టొండెన్[4].

89


సీ.

సరసమాధుర్యవాచాస్ఫుటపటహాది[5]
        విమలపాఠకఘుమఘుమరవంబు
హరిదంత[6]సేవాసమాసన్నరాజన్య
        విజ్ఞాపనావచోవినయరవము[7]
కవిరాజపరమభాగవతదైవజ్ఞాని[8]
        గాయకపణిహారికలితరవము[9]
రతిరాజరాజేంద్రరాజపణ్యాంగనా[10]
        చరణనూపురఝుళంఝళరవంబు
హృద్యమంగళసంధాయివాద్యరవము
శోభితంబగు రాజవేశ్యాభుజంగు
గాయగోవాళు రావుసింగయకొమారు
మాధవేంద్రుని యాస్థానమంటపమున.

90


ఉ.

పాఱని రాజులునా నిగళబంధనులై చెఱసాలలోనికిన్
దూఱని రాజులున్ సిరులు దుర్గములున్ వెస నిచ్చి వెన్కకై[11]
తాఱని రాజులున్ గలరె ధారుణి సింగయమాద నీ వనిన్[12]
మీఱి సమస్తమైన ధరణీవరకోటుల వేఁట లాడఁగన్[13].

91
  1. V V.C. p 49 వర్గంబునకున్
  2. A. B భావించి
  3. A. B పోరుటొండె
  4. A. B శరణను టొండె; VV.C p49 శరణంబొండెన్
  5. A. B పటహ
  6. A. B హరినిమ్న
  7. A. B విజ్ఞాఫణీవచోవీనిధరము
  8. A. B దివ్యక్షాళి
  9. A. B ఫణికలికారితనము
  10. A. B మాణాంగనా
  11. V V.C. p 51; A.B. యొక్క కే
  12. V V.C. p51 మాధవుండనిన్
  13. A. B. కోట్లను వేటలాడగా