పుట:వెలుగోటివారి వంశావళి.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

32


గ్గునుఁ బోనాడి రయంబునన్ బఱవ నా[1]క్షోణిస్థలిన్ జూడ నేఁ
డును నచ్చో నడియాలమై కసవుపాటున్ లేదు[2] త్రోవౌటచేన్[3].

86


ఉ.

ఎత్తి పుటంబుఁ బెట్టి కుదియించి కళంకము దేర్చి కాఁకమై
నొత్తి ఘటించి లోహగతి నొండొకరీతికిఁ దెచ్చి వన్నెగా
నత్తఱి నీపదాంబుజము నందియఁబెట్టిన రాజు లందఱున్
మొత్తము గట్టి సీమలఁగుమోములు వేల్తురు రావుమాధవా[4].

87


సీ.

పశ్చిమదేశభూపతు లంపు పన్నీరు
        ఘనధారఁ జేతులు గడుగు నపుడు[5]
గూడెంపు[6] దొరలు ముక్కున నంపు జవ్వాది[7]
        చమురు జొబ్బిలఁ బట్టి చమరు నపుడు
రాయ లంపిన గంబురాల[8]కర్పూరంబు
        మించు వాసనల వాసించు నపుడు
గజపతి యంపిన కస్తూరివీణెల
        నికరంబు లెస్స దానించు నపుడు
మాన దేలూరు[9] ఝంగిలిఖానరవుతు
దనరపైఁ బడి యాజిలో దునుము నట్టి[10]6
రావు సింగయ మాదకరప్రతాప[11]
ఖడ్గశార్దూలపోతంపుఁగదురు కంపు.

88
  1. V.V.C. p51
  2. A. B. లేవు
  3. VVC p51; A. B త్రోవౌటనై
  4. VVC మొత్తము గట్టినీటొలుకు మోములువెల్తురు నిక్క మింతయున్
    A B. మొత్తముగట్టిశీనులకు మోములువెల్తురు రావుమాధవా.
  5. A. B చేతపులకడుగునపుడు
  6. A. B గుడెంపు
  7. A. B జవ్వాజి జమరు
  8. A. గంబూరాల. B.గబూరాల
  9. A. B మానదెలూఝగిలిఘానునారత
  10. A. B మరుడైపడ
  11. A. B దౌరరావు మాధవనాయకరప్రతాప