పుట:వెలుగోటివారి వంశావళి.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

31


బన్నిన సేనలం దునిమి పాఱఁగఁ దోలె విరాటు వీట న
త్యున్నతవిక్రమంబున సుయోధనుఁ దోలు కిరీటికైవడిన్.

81


ఉ.

రా జని వేఁడుచో మొగము రాఁజగ నర్థులఁ జూచు సట్టియా
రాజులు రాజులే పొలమురాజులు గాక ధనార్థికోటులన్[1]
రాజులఁ జేసి భూమిఁగల రాజుల కెల్లను రాజ వైన[2] యో
రాజకులైకభూషణ విరాజతసింగయరావుమాధవా.

82


ఉ.

ప్రాగ్రహరప్రతాపరణభార్గవ రావనపోత నీవు ఘో
రాగ్రహ మెత్తి సోమకుల మంతయు రోయుచు[3] సంహరింపఁగా
నాగ్రహవృత్తి మాని శశి తా హరుజూట[4]వనాటవీస్థలిన్
విగ్రహ[5]వృత్తి లేక తనవృద్ధియె కోరుచు నుండు నెప్పుడున్.

83


మ.

చిరకాలవ్రతశీలుఁడై నరుఁడు కాశీతీర్థనిర్మగ్నుఁడై
స్థిరలీలన్ వృషభంబు నెక్కి రజతాద్రిం జేరి ముక్కంటి యౌ
టరుదే సింగయ యన్నపోతవిభు బాహాఖడ్గనిర్మగ్నుఁడై
యరివీరుండు గజంబు నెక్కు టరుదౌ నాజిన్ సహస్రాక్షుఁడై[6].

84


క.

వెస రిపుల కంఠరక్తము
ముసురుకొనియె నిందిరాలముందఱి బయలన్[7]
ముసి నిండి పాఱె నీచే
యసిధారల రాయరావుననపోతాంకా.

85


మ.

ఘనశౌర్యుం డగు మాధవాధిపుని ఢాకన్ భీతివిభ్రష్టసా[8]
ధనుఁడై దన్నలకోటయొద్ధ ననపోతారెడ్డి మానంబు సి

  1. A. B. ధనార్థకోటికిన్
  2. A. B. రాజులైన
  3. A. B. మెంతయు రోయక
  4. A. B. జూడ
  5. A. B. నిగ్రహవృత్తి
  6. A. B. ధాత్రిన్ సహస్రాక్షుఁడై V.V.C.
          అరివీరుండు గజంబు నెక్కి సురరాజౌ టద్భుతం బెన్నఁగన్
  7. A. B. ముసురుకొనెన్ ఇందిరాలముందరిబైలన్
  8. V.V.C, p56; C.V.Rao (AC 111 p 39)