పుట:వెలుగోటివారి వంశావళి.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

వెలుగోటివారి వంశావళి


తఱిమి యశ్వత్థామ తండ్రికై యెంతయుఁ
        దగఁ బాండుసైన్యంబు తలలు ద్రుంచె
మహిమీఁద సింగయమాధవోర్వీశుండు
        తండ్రికై రాజుల తలలు గోసెఁ
గాక యిబ్బంగి సంగరాంగణమునందు[1]
వైరివీరుల గెలువ నెవ్వాఁడు చాలు
రామసగరు లశ్వత్థామ రణవిజయుఁడు
మాధవుఁడు[2] దక్కశూరులు మఱియుఁ గలరె.

79


సీ.

ఖడ్గనారాయణు కాహళధ్వను లవె
        యాలింపు వీరనారాయణాంక
దుష్టరంకుశు[3] బలోద్ధూతరేణుపు లవె
        రా దింక నిల్వఁ గేలాదిరాయ
ప్రతిగండభైరవు భయదకేతువు లవె
        యుండరా దిఁక జగనొబ్బగండ
గాయగోవాళుని ఖడ్గదీధితు లవె
        తలఁగుము గుజ్జరిదళవిభాళ[4]
వాఁడె సింగయమాధఁడు[5] వచ్చె వేగఁ
బాఱుతెండని రవుతులు చీరఁ బాఱె
భీతి నన్నవోతారెడ్డి బిరుదు లన్ని
వీటిఁబోవంగ[6] దన్నాలకోటబయట.

80


ఉ.

దన్నలకోట ముందర[7] నుదగ్రబలోద్ధతి గంగ దాఁటి సం
పన్నబలుండు సింగజనపాలుని మాదఁడు రెడ్డిపోతనిన్

  1. A. B. సంగరస్థలమునందు
  2. A. B. రామసగరయశ్వత్థాడు రణవిజయుఁడు మాధవుడు
  3. A. B. దుష్టరాంకుశ
  4. A. గంజ్జరి B. గంజరిదళవిభాళ
  5. A. B. మాధవుడు
  6. A. B. వింటిపోవంగ
  7. V. P. Sastri. ముంగల, Sr Sr. p. 51