పుట:వెలుగోటివారి వంశావళి.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

29


సోమకులం బెల్ల సోదించి పరిమార్ప
        బుధుఁడు సోముఁ దివిచి పొదువుకొనియె
సోమకులం బెల్ల సోదించి పరిమార్ప
        శశి క్షయమున[1] వినాశమును బొందె
ఏది [2]సింగమాద డిందుకులం బెల్ల
వెదకి చంపు టెఱిఁగి విభవ ముడిగి
వెండికఱ్ఱభాతి[3] వీఁకతో[4] నొకకొంత
విదియనాడు వొడిచె వెఱచినట్లు.

76


చ.

గజముఖ! యేమి చంద్ర కడుఁ గందితి వేటికి? రావుమాదభూ
భుజుఁ డటు సోమవంశనృపపుంగవులం దెగటార్పఁ జొచ్చినన్;
నిజమును నట్లుకాదె? మఱి నేనును నేనుఁగమోమువాడనే[5]
గజదళసంహరుం డతఁడు గాఁగఁ జలించెద నోసుధాకరా.

77


ఉ.

వైరుల కాజి[6] మార్కొనఁగవచ్చునె సింగయరావుమాద జం
భారికి రావణారికి నగారికిఁ దారకవైరికిన్[7] మనో
జారికి సైంధవారికి బకారికి[8] దుర్మదవారణారికిన్
సీరికిఁ బన్నగారికి నృసింహునిబారికి నీకటారికిన్[9].

78


సీ.

పరశురాముఁడు తండ్రిపగ[10] సాధ్యముగఁ జేసి
        తరతర నృపతుల తలలు నఱికె
సగరుండు తండ్రికై పగఁగొని రోషించి
        తాలజంఘాదుల తలలు రాల్చె[11]

  1. A.B. గాయంబున
  2. A.B. సింగవిభునిమాద | డిందుకులం బెల్ల
  3. A.B. బాలతి
  4. A.B. నింక
  5. A.B. వీరికై
  6. A.B. వైరులవాజి
  7. A.B.యుగ్రకుమారికి
  8. V.V.C.p50
  9. V.V.C. కైటభారికిన్
  10. V.V.C. 50
  11. A. B. వ్రాల్చె