పుట:వెలుగోటివారి వంశావళి.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


శాసనంబులు వ్రాసి చలమున[1] నూటొక్క
        రాజుల నీరీతి నాజిఁ గూల్చి
ప్రతిగండభైరవుఁ బలుతృప్తి యొనరించి
        చలఁగి[2] ప్రతిజ్ఞచే జయము గొనుచు
మించి బిరుదంబు పచరించి మెఱసి రహహ
ఘనత నల రావు సింగ భూకాంతుసుతులు
[3]......................................
మహిని వెలసిరి యనపోత మాదవిభులు.

74


సీ.

అఱిగి రేఖాకారుఁడై వెల్వెలం బాఱి
        కల్మషహృదయుఁడై కాంతిఁ దొఱఁగి
రోగియై దోషాకరుండు నై విరహయు
        క్తజనాపకారి యై తనర నింగి
లీల మిత్రవిపత్తి[4] కాలవిస్ఫురితుఁడై
        కడుపక్షపాతియై వడిఁ జరించి
మింటఁ బాఱెడువాని వెంటనే చని చంపు
        టెంత పౌరుష మని యెదఁ దలంచి[5]
కరుణ గావ నోపెఁ గాక లేకుండెనా
సోమవంశపరశురాముఁ డనఁగ
వెలయు[6] నన్నపోత విభురావుమాదన
పొడుపుఁగొండ నేల పోవనిచ్చు.

75


సీ.

సోమకులం బెల్ల సోదించి పరిమార్ప[7]
        శంభుండు శశిరేఖ జడలఁ గప్పె
సోమకులం బెల్ల సోదించి పరిమార్ప
        నిందుండు తారలయిండ్లు సొచ్చె

  1. A.B. చెరి
  2. The colloquial form చలఁగు is retained owing to the considerations of rhyme.
  3. The third foot of the verse is missing.
  4. A. B. విపంక్తి
  5. A. త్తదలచి; B. యుక్తతలచి
  6. A.B. వెలసె
  7. Each of the 4 lines has సోధించి పొరిమాల్ప