పుట:వెలుగోటివారి వంశావళి.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

27


శ్రీనాథుగౌతమీభూనాథుఁ డనురాజు
        సంబెట కొండ్రాజు సలకరాజు
మాదిరాజ్ హరిరాజు మల్దేవరాజును
        నంద్రాజుఁ బోల్రాజు నలఘురాజు
శ్రీపతిరాజు నాచిన్నవల్లభరాజుఁ
        జినవంకిరాజు నాకనకరాజు
జనరాజుఁ జినసల్కుఁ జిన్నబెత్తమురాజు
        బాశముచెన్రాజు వాసిరాజు
వీరు మొదలు చాల[1] విక్రమక్రమమున
        నసహాయశూరులైనట్టి వారి
ఘనత కెక్కినరాచగణము నూటొక్కరి
        సోమవంశగ్రహణ సూడు వెట్టి[2]
యనపోతనృపుఁడును నామాదవిభుఁడును
        బలపరాక్రమమునఁ బ్రతిఘటించి[3]
రావువంశమునందు రాహుకేతువులన
        నతికోపమునఁ జుట్టి[4] యరులఁ బట్టి
యినుగుర్తికోటలో మొనయు రాచకొమాళ్లఁ
        దునియలుఁగాఁ గొట్టి దోరవెట్టి
జల్లిపల్లొద్దను జలమును సాధించి
        కలుగానుఁగల రాచగణము నాడి[5]
రక్తంబు మెదడును రణభూతముల కిడి
        రణముఁ గుడిపి పరాక్రమము మించి[6]
యగ్రహారముభట్ల కనుమగ ల్లిచ్చి యు
        త్తమప్రతాపస్ఫూర్తి దనరఁ జేసి

  1. A. B. వీరు మొదలయిగూడి విక్రమక్రమమున
  2. A. B. నూటొక్కర్ని...గ్రహణసూటి వెట్టి. 'గ్ర' in the word గ్రహణ must be slurred oven in pronunciation
  3. A. B. బలపరాక్రమము నుగ్రతవహించి
  4. A. B. రాహుకేతువులను నతిక్రోధమునజుట్టి
  5. A. B. చలము సంపాదించి...రాచకణమువాడి
  6. A. B. రణముగుడిపించి పరాక్రమమునమించి