పుట:వెలుగోటివారి వంశావళి.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


యోటమందిరి[1] సింధూరికోటబైట
సన్నుతఖ్యాత రాయరా వన్నపోత[2].

72


క.

ధరలోన రావుసింగయ[3]
వరతనయుం డన్నవోత[4]వసుధావరుచే
కరవాలమునం గూలిన
గురుతుగ నూటొక్కరాచకూటమి వినుమా[5].

73


సీ.

[6]ఆకొండరాఘవుఁ డనుకొండరాజును
        గోవిందరాజు నాగోపరాజు
బలశాలి వీరహెమ్మళిదేవరాజును
        బాణెమురాజు నాపాపరాజు
జూటూరిసూరుఁడు సొరిది సోమలదేవు
        పినరాజు చెన్రాజుఁ బెద్దిరాజు
అప్పచ్చిచెన్రాజు నారాఘవుండును
        సాళ్వరాఘవ[7]రాజు సర్వరాజుఁ
దిరుమలరాజును[8] తెలివి విఠ్ఠలరాజు
        నలకంపరాజును నరసరాజు

  1. A. B. బల్యెమంది
  2. The second part of the line 13 changed into ఖ్యాతియపోత మన్నెరాజు by the authors of V.VC.
  3. A. B. రాయసింగయ
  4. A. B. వరతనయుడు నన్నపోత
  5. A. B. వినుతా
  6. The first seven lines are in a corrupt state in the Mss.
    ఆకొండరాఘవుండును కొండరాజు బుక్కరాజు గోవిందరాజు
    యాగోపరాజు బలశాలి విరహంబళు దేవనురాజు పాణెమురాజు
    యాపాసరాజు జూంటూరిసూరుండా సొరది సోమఅదేవు
    పినరాజు చినరాజు పెద్దిరాజు అప్పచివన్నరాజు యారాఘవుఁడును
    సాళ్వరాజును యాసర్వరాజును తిరుమలరాజు యాతెలివి
    విఠలరాజు నలకంపరాజు యానరసరాజు
    శ్రీనాథుగౌతమిభూనాథుఁడను రాజు సంబెటకొండ్రాజు సకలరాజు
    మాదిరాజు హరిరాజు మల్దేవరాజును అండ్రాజు పోల్రాజు నలఖురాజు
  7. VV.C.p 33
  8. Ibid. తిరుమలపోల్రాజు