పుట:వెలుగోటివారి వంశావళి.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

25


మ.

మునుముట్టంగ నితండు సోమకులనిర్మూలంబు సేయం గలం
డని సర్వేశు జటాటవిన్ [1]బ్రతికెఁ గాకంబేద లేకున్న నే
డనిలో సింగనరేంద్రపుత్ర యనవ తాధీశ నీకోపసం
జనితాగ్నిన్ బ్రబలంబు గంది యెరియన్[2] జంద్రుండు లోఁగుందఁడే.

70


క.

ఇనువెనుకే గ్రహచక్రము
వినుతామరనివహమెల్ల వెనకయవెనుకే[3]
జనపతులు సాహసంబున
ననపోతనృపాల నీకు నందఱు వెనుకే.

71


సీ.

అశ్వరేవంత నీ వశ్వంబు నెక్కిన
        దండిరాజులగుండె తల్లడిల్లు[4]
ధరణిసౌభాగ్య నీతరవారిఘాతకుఁ[5]
        గర్ణాటసేనలు గళవళించు[6]
సంగ్రామపార్థ నీచాపటాంకృతులకు[7]
        దెలుఁగురాజ్యం బెల్ల దిగులుగొనును
బ్రథన[8]నిశ్శంక నీబల్లెంపుఢాకకు
        నుల్కుల్కి పడుచుండు నొడ్డెరాజు
నీవు తఱిమినచోటను నిల్వలేక
సొరిది[9] సురథాను రాజులు సొంపు దప్పి

  1. B సర్వేశ్వరుజటాటవిన్ బ్రతికెగాకంభోది
  2. B.నీతోడ సం|జనితాగ్నిన్ బ్రబలంబు గుంది మెరయన్
  3. cf V P Sastri (Cmm 1 P 58)
    A. B. యినువేనికి గ్రహచక్రము బినుతామరనివహమెల్ల వెనుకయువెనుకే
  4. V.V.C. p 11; A. B. గుండెలు తల్లడించు
  5. Ibid; A B. తరిని నీసౌభాగ్య తరవారిఘాతకు, తరి నీ సౌభాగ్య తరువళిఖాతకు
  6. Ibid; A B. కల్వరించు
  7. V.V.C; A. B. వింటికింకిణులకు
  8. V.V.C; A. B. బవర
  9. V.V.C; A. B. సురది