పుట:వెలుగోటివారి వంశావళి.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


శా.

అగ్రేయాహవశౌరిసింగయసుతుం డాయన్నవోతున్ రణ
వ్యగ్రప్రాగ్రహనిగ్రహగ్రహభరప్రాప్తప్రతిప్రశ్రయా[1]
త్యుగ్రప్రాగ్రహవిగ్రహగ్రహణరాహూదగ్రదోర్మండలా[2]
గ్రాగ్రద్యోతుని[3] వీరవిగ్రహుని డాయన్ వచ్చునే యాజులన్.

66


ఉ.

ఆలములోన సింగవసుధాధిపునందన యన్నవోతభూ
పాలక నీకు నోడి యనిఁ బాఱిన వైరుల నాలభంగి నే
తోలుదుకాని చంప వఁట దోస మటంచును నౌర గాయగో
వాళుఁడ వైన నీకు పశువర్గముఁ గాచుట నైజమే కదా[4].

67


శా.

ఆవి ల్లారథ మాశరంబు గలచో నామేటి చేఁ జిక్కినన్
దేవారాతిపురంబు లేయునెడ సందేహించెఁ[5] బెక్కేండ్లు క[6]
న్గ్రేవన్ గెంపగు[7] నంత సోమకులభూరిక్షత్రియశ్రేణులన్
[8]బ్రోవుల్గాఁ దునుమాడె సింగవిభుపుత్రుం[9] డన్నవోతం డనిన్.

68


ఉ.

వాలిన నీదు చేతికరవాలముచాయలు సోమవంశభూ
పాలుర[10] ఫాలభాగమున బ్రహ్మ లిఖించిన వ్రాలుకైవడిన్
బోలఁగ నిన్నుఁ[11] జూచి నృపపుంగవ సింగయయన్నవోత యా
భీలపరాక్రమంబు చెడ భీతివహించి రరాతికోటియున్.

69
  1. A. ప్రశ్రియా B. ప్రశ్రమ
  2. A B దోఃఖండలా
  3. హేతిని
  4. The verse bas been altered in V V.C. p 41 thus:
    ఉ. ఆలములోన సింగపసుధాధిపనందనుఁ డన్నవోతభూ
    పాలకమౌళి కోడి యనిఁ బాఱినవైరుల నాలభంగినే
    తోలును గాని చంపఁ డఁట దోస మ టంచును నౌర గాయగో
    వాలున కుర్విలోన పశువర్గముగాచుట నైజమేకదా.
  5. A. B. సందేహించి
  6. B. న
  7. A. B. కెంపుగ
  8. A. ప్రౌవుల్గా; ప్రావుల్గా
  9. A. B. సింగయసుతుం డన్నవోతుం డనిన్
  10. A. B. పాలకు
  11. A. B. నేను