పుట:వెలుగోటివారి వంశావళి.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


సీ.

రణవీథిఁ గొండమల్రాజుఁ గొమ్మలదేవు
        పిన్నని జయరుద్రుఁ బెనఁచి తఱిగి
తలలు పొక్కండ్లుగా నిలిపి తద్రక్తమె
        యెసరుగా బలివండి యెసకమెసఁగి[1]
హెమ్మాడియును గూడి యెలమి నూటొక్కండ్ర
        రాజులఁ బగఁబట్టి రమణఁ జంపి
కలుగాన్గ లాడించి కలరక్త మెల్లను
        భూతసమితి తృప్తి పొందుపఱచి
జల్లిప ల్లొద్ద రాజుల త్రుళ్లణంచి
యహహబిరుదులు[2] పచరించి రపుడు వేడ్క
ననుమగ ల్చొచ్చి రల భట్టు లౌననంగ[3]
మహిని సింగయయనపోతమాద విభులు.

64


సీ.

ధర శకాబ్దము శిఖికరిభాను[4]శార్వరి
        కార్తికశుద్ధపక్షంబు నందు
హరిహరబ్రహ్మలు నలయరుంధతియును[5]
        శశిరవిగ్రహములు సాక్షి గాఁగఁ
బితృపితామహులకుఁ బ్రీతిగా రేచర్ల[6]
        గోత్రమహత్త్వంబు కొమరు మిగుల
బలసముద్ధతి సోమకులరాజరాజుల
        బలభేది గదియఁ గొలువఁ బనిచి
భూమి[7] సోమకుల పరశురామ బిరుదు
శాసనస్తంభమున వేసి జల్లిపలి
కడను భట్రాజతతి[8] నన్మగంట నిలిపి
పరఁగి రనపోత మాదభూపాలవరులు.

65
  1. A. B. రణముగుడిసి
  2. A. హహబిరుదులు; B. హాహవ
  3. A. B. అనుమగల్లిచ్చి రలబట్ల కాననంగ
  4. A వ(?ద)రనిశాకాబ్దభానువరశిఖి; B వరనిశాకరభానువరశిఖి
  5. A B లునరుంధతిపతియును
  6. A B పితృపితార్పితమహాప్రీతిగా
  7. A B భువిని
  8. A B భట్రతి