పుట:వెలుగోటివారి వంశావళి.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


సీ.

క్షత్రియకులము నిఃక్షత్రంబుగాఁ జేయు
        పరశురాముని రీతిఁ బగ యణంచి[1]
కీచకవీరుల గీటణఁగించిన
        పవనతనయు రీతిఁ బగ యణంచి
గాంధారి సూనులఁ గణఁగి యుక్కణగించు[2]
        ఫల్గును కైవడిఁ బగ యణంచి
పన్నగ నికరంబు పరఁగంగఁ ద్రుంచిన
        పక్షినాథునిరీతిఁ బగ యణంచి
యిట్లు జల్లిపల్లి నెనసిన[3] చాళిక్య
వంశకరులనెల్ల వరుసఁ ద్రుంచి
పరఁగె నన్నవోతు[4] ప్రతిగండ భైరవ
బిరుదరాజగండ[5] భీకరుండు.

61


ఉ.

రాజుల నూట యొక్కరి శిరంబులఁ ద్రుంచి రణంబులోపలన్
రాజకుమారు లెమ్ము రుధిరంబుల వండిన భుక్తిఁ దృప్తులై
రాజకపాలపాత్రమున రక్తముఁ గ్రోలుచు భూతకోటు ల[6]
ట్లాజిజయుండు సింగవిభు నగ్రసుతుం డనవోతుఁ బాడెడున్[7].

62


ఉ.

కొమ్మని మచ్చయౌబళుని[8] గూల్చి శిరంబులు ద్రుంచి గన్నయన్
బిమ్మటఁ ద్రుంచి తత్సుతులఁ బేర్చిన బొమ్మలు వెట్టి[9] దారులం
దమ్మటము ల్వెసం గొనియె దాచయసింగనిపట్టి యెట్టిడో[10]
బొమ్మలు బెట్టు నిట్టు[11] లనపోతఁడు[12] వైరముఁ బూను వారికిన్.

63
  1. A. B. పగయణంగించి
  2. A. B. కఱయక్కణగించు
  3. A. B. నెగడిన
  4. A. B. అన్నవోత
  5. A. B. బిరుదురాజులగండ
  6. A. B. భూతకోట్లట్లా
  7. A. B. సింగవిభు నగ్రసుతుండనవోతుం బాడెదమా
  8. A. B. యాభళుని
  9. A. B. సింగముపట్టి
  10. A. B. యట్టిడో
  11. నిట్లు
  12. A. B. పోతుడు