పుట:వెలుగోటివారి వంశావళి.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


ధ్వనులును జయభేరీభాంకృతులును[1] మొరయ[2] వేదోక్తంబుగా నాశీర్వా
దంబుల దీవనాక్షతలఁ జల్లు బ్రాహ్మణోత్తములకు నగ్రహారంబు లిచ్చి, చక్ర
వరము నొక్క[3] రాజుభట్టు కగ్రహారంబుగా నొసంగి[4] యనుమగల్లు పాలించి,
రాజ్యం బపరిమితసంతోషక్రియ నేలి, బహుమంత్రి[5] బహుదండనాథ
వర్గంబులకు ఛత్రచామరాందోళిక లొసంగి, తమ[6]పద్మనాయకుల దుర్గాధి
పతులం జేసి, బడినాయంకులకు తమ[7]నిజహితపరివారంబునకు బహుభూషణ
మాణిక్యాంబరంబు లొసంగి, మించినజల్లిపల్లి, చెంజర్ల[8] రణక్షోణి[9] భారతీక
మల్లుండ్రని[10], యినుమాఱులు[11] రణంబుఁ గుడిసి, సింహతలాట, సోమకులపరశు
రామ, యంతెంబరగండ, ధరణీవరాహ, చౌహత్తమల్లబిరుదంబులు తామ్ర
శాసనంబుల వ్రాసి, భట్ల ననుమగంటియొద్ద[12] నిలిపిన ప్రతాపశాలులు[13]
పూర్వమే యనుమనగంటిపురవరాధీశ్వరులును[14] బిల్లలమఱ్ఱిబేతాళుని వంశా
వతార[దామా?] నాయని కులోద్ధారకులును[15], వెన్నమనాయని వంశరత్న
ములును[16] నెఱదాచానాయని వరపౌత్రులును నూర్జితప్రభావులునై, కంచి
శాసనోద్ధారకులై పరగిరౌర[17]. మహిని సింగయయనపోతమాదవిభులు.

60
  1. A. B ఖాంకృతులున్ను
  2. A. B మెరయ
  3. A. B చక్రవరములో
  4. A. B రాజు భట్టున కగ్రహారంబు లొసంగి
  5. A. B బహుమంత్ర
  6. A. B తన
  7. A. B తన
  8. A చంజ్జర్ల; B చంచర్ల
  9. AB క్షణో
  10. AB భారతీకమల్లండని
  11. AB ఇనుమాటు
  12. AB అనుమగం టొద్ద
  13. AB ప్రతాపశాలి
  14. AB పూర్వ అనుమగంటి పురవరాధీశ్వర
  15. AB కులోద్ధారక
  16. AB పాత్ర
  17. AB పరగితా(కా)ర