పుట:వెలుగోటివారి వంశావళి.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


రణవీరబేతాళ, భైరవ, వీరభద్రా, రణపోతురాజా, కలహకంటకీ, యని నిజ
బలంబులకు[1] జయంబు గల్గె[2]ననుచు, కలహాధిదేవతల[3] నారాధించి, తలంచి,
పూజించి, కాళీ మహాకాళికి వీరరాజుల నరబలిగా [4]నఱికించి, భట్టును దాము
ను[5] రణము గుడిపించి, వారిరక్తంబులఁ దమతండ్రికిఁ దిలోదక పితృతర్పణం
బులు చేసి, వైరివీరుల స్వర్గంబున కనిపి, తమ రేచర్లగోత్రుల కభ్యుదయపరం
పరాభివృద్ధి యాతారచంద్రార్కంబుగా[6] భైరవబేతాళునిచేత సహస్రవర్షం
బులు వంశాభివృద్ధియు రాజ్యాభివృద్ధియు నగునట్లు,[7] వరంబు వడసి[8] తమ[9]
ప్రతాపకీర్తిస్ఫూర్తి హెచ్చై[10] ప్రభవించునట్లు అంగ, వంగ, కళింగ, కా
శ్మీర, కాంభోజ, కరహాట, కర్ణాట, కురు, పాండ్య, బర్బర, సింధు, గాంధార,
ఘూర్జర, మళయాళ, నేపాళ, సౌరాష్ట్ర, సుమన, శూరసేన[11], సుధేష్ణ, ద్రవిళ,
కేరళ, కుంతల, అవంతి[12], విదర్భ, మాత్స్య, కుళింద, పులింద, చోళ,
బంగాళ, పాంచాల, పారశీక, ఆంధ్ర, యవన, విదేహ, చేది, కరూశ,
కన్నోజ, కొంకణ, టెంకణ, త్రిగర్త, లాట, భోట, మరాట, నిషధ[13],
గుజ్జరాష్ట్ర[14], ఉసీనరి[15], ప్రాగ్జ్యోతిష, బాహ్లిక, సాళ్వ[16], గౌళ, మగధ,
యుగంధర, హూణదేశంబు లనెడు ఛప్పన్న[17]దేశాధినాథులకును బ్రసిద్ధం
బుగా భటకవిగాయకులచేతఁ, దనకీర్తి దిక్పూరితంబుఁ జేయించి, జయ

  1. A. B. బలంబులుకు
  2. A. B. జయంబుగల్గి
  3. A. B. కలహాది దేవతల
  4. A. B. మహంకాళి
  5. A. B. తానును
  6. B. చంద్రతారకముగ
  7. A. B వంశాభివృద్ధి రాజాభివృద్ధి గానట్లు
  8. A. B భైరవుని చాత వరంబువడసి, భైరవుని చాత
  9. A. B తన
  10. A. B హెచ్చరిక
  11. A. B సూరసేన
  12. A. B కుంతలావంత
  13. A. B నిషాధ
  14. A. B After గుజ్జరాష్ట్ర, మహారాష్ట్ర is mentioned. This is superfluous
    as మరాట has already been included in the list.
  15. A. B సీనర
  16. B. సాధ్య
  17. A B. లనెడిక్ష[ఛ]ప్పన్న