పుట:వెలుగోటివారి వంశావళి.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

35


కలశాబ్ధికల్లోలఘటల బిబ్బోకంబు
        లమృతాంశుకిరణగుచ్ఛములు[1] సాటి
అమృతాంశురణగుచ్ఛాడంబరంబులు[2]
        వారిజాసనువారువములు సాటి
వాని వానికి[3] నివి సాటి వచ్చుఁ గాని
సకలభువనైకమౌక్తికచ్ఛత్ర [మనఁగఁ]
బరిఢవిల్లిన నీకీర్తి పాటి రావు
అన్నపోతాంక వీరనారాయణాంక.

94


ఉ.

మత్తుఁడు కూర్మరాజు విషమత్తుఁడు నాగవిభుండు మిక్కిలిన్
మత్తుఁడు సూకరాధిపుఁడు మత్తగజంబులు తిండిపోతు లీ
తొత్తడిఁగాపురంబు తులఁదూఁగ[4]దటంచును రత్నగర్భ దాఁ[5]
బొత్తుల నీభుజాబలము పొందెను రావనపోతభూవరా.

95


సీ.

ఘనకపాలంబులు కాయలు గాఁగను
        వాలుఁజెవులు బైసిణీలుఁ గాఁగఁ[6]
గోలెమ్ము[7] వళువుగ బాళిక చర్మంబు
        నందుఁ గీలించిన యనుచులుగను
బెనుపొంద నాసికయును సరస్వతి గాఁగ
        దట్టంపుఁ బ్రేవులు తంత్రులుగను
గరరుహంబులు జీవగఱ్ఱలు గాఁగను
        జత్రుచయంబులు[8] సారెలుగను

  1. B. గుంభములు
  2. B. గుభాడంబరములు
  3. A. B. వాటివాటికి
  4. V.P. Sastri, Cmm. 1. p67; A.B. తలదూగ
  5. V.P. Sastri, Cmm. 1. గర్భనీ , A. గర్భరా, B, గర్భడా
  6. A.B. బవిసినీలు
  7. A.B. కోలెంపు
  8. A.B. శత్రుచయంబు