పుట:వెలుగోటివారి వంశావళి.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


సింగమనాయండె జల్లిపల్లికోట మీఁది కెత్తిపోయి తనమఱఁది చింతపట్ల
సింగమనేని కొఱకు ముట్టడిగా దిగఁగఁ[1] గోటలో రాచవారు తంబల బొమ్మ
జియ్యచేతఁ గృత్రిమ[2]స్వరూపానఁ బొడిపించఁగఁ దనకుమారుల, ననపోతా
నేనిని,[3] మాదానేనింగారిని రావించి, రాజుల రక్తమునఁ దిలోదకములు
సేయుం డని చెప్పిన, నాసింగమనేనిని దహించకయె[4] కోట లగ్గఁ బుచ్చు
కొన్నవిధం బెట్టి దనిన.

59


శ్రీచీతువరాల వీరనారాయణసేవాపరాధీన, రేచర్లకులవార్ధిచంద్రోదయ,[5]
గోలి మల్లారెడ్డి రణభూతబలిహరణ, మంగిపూడి యిమ్మడిరెడ్డి రణరంగ
మర్దన, రావువరపు మల్లారెడ్డి భుజాఘట్టన, పోలూరు సోలారెడ్డి రణనిర్ధూ
మధామ, బండి కాటారెడ్డి రణభుక్తఖడ్గబేతాళ, వినికొండ మా[రా]రెడ్డి
వాయుభుక్తకరవాలక్రూరసర్ప, కుంట్లూరి మారారెడ్డి కంఠవిదళనమహాఖడ్గ
భైరవకరవాలదంష్ట్ర, అరువపల్లి నెల్రెడ్డి[6] బలాటవీదావాగ్నికీల, క్రొత్తకొండ
కొండ్రెడ్డి ప్రాణాపహార, నౌరగిరి నారారెడ్డి కులకాలచక్ర, మలచను కొండ
మాచారెడ్డి గజసింహరాయ, రామగిరిపట్టణాధీశ్వరులైన ద్విశతగిరి[7]దుర్గాధీ
శ్వరు లైన, పంట ముమ్మడి పంట మైలారు రాజులును, [8]బిరుదునకై విరసించు
కమ్మనాయంకులును, మొళుగూరిదుర్గసమీపంబునఁ, జెంజర్ల[9]భూమిప్రాంతం
బున[10]6 సంగరంబు సేయ[11] ఖండవిఖండశతఖండతుండంబులుగా నఱికి యట్ట
లాడించి, వారి తలలు గొట్టి భూతబలిఁ బెట్టి[న] రేచర్ల విక్రమ[12]నిత్యకల్యాణ

  1. B. దిగితె
  2. B. క్రిత్తిమ
  3. B. అనపోతానేని
  4. B. దహించక
  5. B. రేచర్ల వార్ధికులచంద్రోదయ
  6. A. నెర్లెడ్డి B. నెర్లిరెడ్డి,
  7. A B. ద్వితీయకత
  8. A B. న్ను
  9. A చెంజ్జెర్ల; B చెంజెర్ల.
  10. A. B. ప్రాంత్యంబున
  11. A. B. శాయ
  12. A. విక్రమ, but it can also be read as చిద్రమ. B చిద్రమ; the meaning
    of the term, however, is far from clear.