పుట:వెలుగోటివారి వంశావళి.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


రాయరా వన్నపోతాధీశ్వరఖడ్గనారాయణుం డన జయభేరి తమ్మటధ్వనులు
బిరుదుకాహళారవంబులు[1] మ్రోయించి భూప్రసిద్ధంబుగా వందిమాగధు
లొక్కంట నెదురై[2] చాటించిన [3]వనితాజనహృదయవనవసంత, యెఱ
కృష్ణరాయని ప్రాణసంహార, చోడ పర్వతరాజు మస్తకరంపమ, నందివాడ
నరసరాజు శిరఃఖండన, తిర్మలరాజు కొండ్రాజు సంగరాటోప, సరియపల్లి
పల్లవరాజుల గెల్చిన సంగరోత్సాహ, సలకరాజు సప్తాంగహరణ, కట్ట వెంగ
ళ్రాజు[4] కంఠవిదళన, యుద్దగిరి యోబుళ్రాజు[5] వెన్నుఁ గొట్టిన యాహవ
ఫల్గుణ, బాల దేవలాజు[ను][6] మ్రింగిన ఖడ్గకాలరాహువ, సంబెటభూనాథు
సప్తాంగహరణ, పూసపాటిరాజుల నెత్తిపిడుగ, కమ్మదొరల మోదిన కాల
దండమ, కన్నడరాయమన్నీల గుండెదిగుల, బిరుదునకై విరసించు యిందు
వంశంబురాజుల కోలాహలుం డైన తమతండ్రి [7]చీతువరాల సింగభూపా
లుండు జల్లిపల్లికోటకు ముట్టడిగా దిగఁగ[8] కోటలో రాజులు తమ్మల
బొమ్మని చేతఁ గృత్రి[9]మానఁ[10] బొడిపించఁగ[11] నతనికుమారులు[12] అనపోతా
నేడు[ను] మాదానేఁడు[ను] ఆసింగమనేని[13] దహించకయె[14], తండ్రి
వాక్యంబులు దలంచి కోటలగ్గఁ బుచ్చుకొనువారై నిలచిన కొండ మల్రాజు,
కొమ్మలదేవు పిన్నఁడు, మచ్చ ఓబళ్రరాజు మొదలగు[15] నిందువంశంబు
రాజు లయిదులక్షల యఱువది[16]వేలబలంబును గూర్చుకొని వచ్చి,

  1. A B. బిరుదురాహాళారవంబులు
  2. A B. మాగధులు వాఖ్కం టెదురై
  3. A B. There is probably some lacuna in the text here
  4. A B వెంకట్రాజు
  5. A B. వుద్దగిరి వోబుళ్రాజు
  6. A B. దేవల్రాజు
  7. A B. చితువరాల
  8. A B. దిగితె
  9. A B. క్రిత్తి
  10. B. ల
  11. A. B. పొడిపిస్తే
  12. A. B. కొమాళ్ళు
  13. A. B. నెన్ని
  14. A. B. దహించకె
  15. A. B. మొదలుగా
  16. A. B. రాజులు అయిదులక్షల నరువది