పుట:వెలుగోటివారి వంశావళి.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


భూసుతుఁ డెఱ్ఱదాచఘనుపుత్రుఁడు సింగని ఘాత[1] కోడి తా
మానము దూలి వచ్చిన విమానముఁ జూపక రోసి[2] వచ్చితిన్”.

55


ఉ.

ఆఁకలిఁ గొంటిమో కరుణ నన్నముఁ బెట్టెడి తల్లి కల్గునో
చీకటిఁ బెద్ద గ్రామ మిటు చేరితిమో కృపఁ జేయు డింతము
ద్దాకునఁ [3]బెట్టరా యనుచు దాచయసింగని దాడి కోడి యా
తేఁకువ చెడ్డ రాజు లిటు త్రిమ్మరు చుండుదు రన్యభూములన్.

56


ఉ.

దాచయసింగభూవిభుని దాడికి నోడి యరాతిసంఘముల్
వే చని యీరముల్ పొదలు వృక్షచయంబులు దూఱ మేనులన్
దోఁచిన కంటకక్షతులఁ[4] దోయజలోచన లాగ్రహంబుతోఁ
జూచి నిజేశులం దలఁగి[5] చూతురు సాయక దూఱు చుగ్రలై[6].

57


క.

తమ్మ తమ కెంత ప్రియమో
తమ్మకు చెయిఁ జాచి రిపులు తలక్రిందై నీ
తమ్మపడిగాన నుందురు[7]
బొమ్మల క్రియ రావుదాచభూవరుసింగా.

58


వ.

ఆసింగమనేఁడే మగతలకడ మచ్చకొమ్మానేనిని[8] జిలుగుపల్లికడ రుద్రా
నేనికి[9] గన్నమనేనినిఁ[10] జంపి, యీ రెండురణాలుఁ గుడిసి జిలుగుపల్లిసంగ
రాంగణోన్ముఖ[11]మచ్చనాయంకుల తలగొండగండ[12], వైరిసామంత
గోలకొండమనాయకరగండ బిరుదు వహించిన వాఁడు సీతువరాల

  1. A.B. సింగముఖాత.
  2. A. రో వచ్చితి B రోరి వచ్చితిన్
  3. A B చి[బి]క్క మం । దారక పెట్టరా
  4. A B శ్రీతులు.
  5. A B డలగి
  6. A B చూతురుగ్రులై
  7. A B నొందురు
  8. A B మగతులకాడ మచ్చకొమ్మా నేనిన్ని
  9. A B కాడ... నేనిన్ని
  10. A B న్ని
  11. A B సంగరాంగరణోన్ముఖ.
  12. A B తలగండగండ