పుట:వెలుగోటివారి వంశావళి.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


వ.

అతనికుమారుండు.

49


శా.

వీరగ్రామణి యాచభూపసుతుఁ డావిర్భూతభూరిప్రతా
పారంభక్షపితారిగర్వుఁ[1] డనవద్యాచారుఁ డత్యున్నతా
కారుం డాహావకేళిభైరవుఁడు నాగక్ష్మావరుం డూర్జితా
కారుం డొప్పెఁ[2] గఠారిరాయఁ డని లోకం బెల్లఁ గీర్తింపఁగన్[3].

50


క.

అనపోతారె డ్డెదిరిన
ఘనుఁడై దన్నాలకోటకాడను మున్నే
వెనుడాగు పెట్టి[4]విడిచెను
వినుతింపఁ గఠారినాగవిభుఁడు ధరిత్రిన్.

51


వ.

సంతతికి సింగమనేఁడు మొదలు.

52


చ.

బలువిడి మచ్చకొమ్మ [విభు] బాచని[5] జీలుగుపల్లియొద్ద న
చ్చలమునఁ ద్రుంచి తద్రణము సాహసుఁడై కుడిపించె భూతముల్
పలుమరు సొక్కి యాడుచును బాడుచు మోద మొనర్ప నయ్యెడన్
జెలఁగఁడె[6] యెఱ్ఱదాచవిభుసింగఁడు భూరిపరాక్రమంబునన్.

53


చ.

మగతలయొద్ద నుద్దవిడి[7] మార్కొని రాజులు సన్నుతింపఁగా
నగణితవిక్రమస్ఫురణ నాలములోపల మచ్చరుద్రునిన్
దగ వడఁ దోలి చంపె నెఱదాచయసింగడు పార్థు కైవడిన్
బగ యడఁగించి యచ్చటన[8] పండువు సేసెను భూతకోటికిన్.

54


ఉ.

“ఏను మనోజభోగముల కేఁగి మహీస్థలి నాహవంబులో
మేనక! మచ్చగన్నవిభు మెచ్చ వదేటికి?" "రంభ! చూచితే

  1. V V.C; A B ప్రతా । పారంభధత్కుటిర గర్వుఁ
  2. V V.C; A B నాగక్ష్మావరుం డుగ్రరో । స్సారుం డొప్పె
  3. V V.C; A B సత్సంగంబు కీర్తింపఁగన్.
  4. A. B. డాగుపెట్టె
  5. A. B. మచ్చకొమ్మని బాచని
  6. A. B. చెలువుడు
  7. B. పగగుల
  8. A. B యచ్చలను