పుట:వెలుగోటివారి వంశావళి.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


చ.

అగణితకీర్తిలోల సుగుణాకర దాచయవెన్నభూప నీ
పగతురు కొండలెక్కి[1] తమభామలకోమలదేహదీధితుల్
జిగిగొని నిండినన్ గుహలఁ జీఁకటిపాసినఁ దమ్ము గాంతు రన్
దిగులునఁ గస్తురి న్వెదకి తెత్తురు మేనుల[2] మెత్తనత్తఱిన్.

43


వ.

తదనుజుండు.

44


ఉ.

వాలునఁ బోయి వత్తు రాలవారలు నప్పటి చుక్కవంకగాఁ
దేలని పూర్వమైన తమదేశము పొందుకు ప్రాణభీతులై
చాలక యన్యరాజ వర[3]సంఘము దాచయవెన్నభూప నీ
వాలునఁ బోయి రారు సుర వల్లభు లింటను కావ లుండుటన్.

45


వ.

తదనుజుండు.

46


చ.

పగతుల కెఱ్ఱదాచ నరపాలుని యాచఁడు దాడి[4]వెట్టుచో
మొగుపనిచేతులున్ దిగులుముట్టని[5] గుండెలు గొంకిముండ్లలో[6]
దగులని మేసులు బిరుదు దాఁచని[7] రొమ్ములు మాఱుదేశముల్
నిగుడనికాళ్లుఁ బూరిఁగబళింపని నోళ్లును గల్గకుండునే.

47


స్ర.

వీరుం డాయాచపృధ్వీవిభుఁ డ[తులభుజా]విక్రమన్యక్కృ[తాన్య
స్ఫారుం డై] మచ్చగన్న ప్రముఖనృపతులన్ బ్రాణము ల్వాపి హెచ్చెన్
[దోరాజత్] ఖడ్గధారన్ దునిమెఁ దురకలం దోలి తత్సైన్యరాజీ
ఘోరాజీధాటి చెల్లన్ గొలచలమపురిన్ ఘోటికాళోటిఁ దెచ్చెన్[8].

48
  1. B. కొంత లెక్క.
  2. A. B. చేనులు.
  3. A. B. రాజనృప.
  4. V V C, A. B. యాచడు పెట్టుచో
  5. V V C.; A. B ముద్దని
  6. A. B ముండ్లను, V.V.C ముండులన్.
  7. V V.C; దాల్పని
  8. This verse is in a most corrupt condition. It is impossible to restore it
    without the help of another Ms. The text furnished by the Mss
    runs thus:
    వీరుం డాయాచపృథ్వీవిభుండు విక్రమమాన్యకృపాలు డై
    మచ్చగన్న ప్రముఖనృపతుల ప్రాణముల పాసె హెచ్చుదోఃఖడ్గ
    ధార దునిమె తురకల దోలి దత్సైస్యరాజి ఘోరాజి ధాటిజెల్లె
    కొలచలముపురిం ఘోటికాకోటి దెచ్చెన్.