పుట:వెలుగోటివారి వంశావళి.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


వ.

ఆయెఱదాచానేఁడును నలదాచానేఁడును[1] గుంట్లూరియిమ్మడిం జంపి గొల్ల
పల్లికడ[2] రణముఁ గుడిపి నిత్య[3]కల్యాణంబును, బచ్చతోరణంబును[4] దెచ్చి
వీరపాండ్య, విక్రమపాండ్య, పరాక్రమపాండ్య, సుందరపాండ్య, కులశేఖర
పాండ్యులగు[5] పంచపాండ్యులను గంచికడ[6] రణముఁ గుడిపి జయంబు గాంచి,
కంచికవాటచూఱకార బిరుదును, [7]బంచపాండ్యదళవిభాళ బిరుదును[8] నే
బిరుదరగండ సర్వబిరుదు కొమరవేశ్యాభుజంగ బిరుదును[9] నానావర్ణమండలీ
కర నెల్లూరువీరక్షేత్ర[10] రణభారతీమల్ల బిరుదును[11], తిరుకాళరాజరాజ్య
స్థాపనాచార్య బిరుదును[12] దెచ్చినవారు రావుయెఱదాచానేఁడును నలదా
చానేడును[13]. ఆయెఱదాచానేనికి[ని] బోచమదేవులకును ముగ్గురు
కుమారులు పుట్టిరి.

38


ఆ.

సింహవిక్రముఁ డగు సింగమహీశుండు
వెన్నుఁ డనఁగఁ దగిన [వెన్న]విభుఁడు
.....ర్తియైన యేచనృపాలుండు
ననఁగ వినయ నయ జయాభినుతులు.

39


వ.

అం దగ్రజుండు.

40


ఉ.

లాలితశౌర్యశక్తి నవలక్ష తెనుంగుదళంబు నాజిలోఁ
దోలిన పాండ్యభూవిభుని తోడి[14] పెనంకువ కోర్చి సన్నుతిన్
వాలి ప్రతాపరుద్రుసభ వర్ణన కెక్కిన యెఱ్ఱదాచభూ
పాలసుతుండు సింగని కభంగుని కేబిరుదైనఁ జెల్లదే[15].

41


వ.

అతని యనుజుండు.

42
  1. A B. న్ను
  2. A B. కాడ
  3. A B. నిచ్చ
  4. A B. న్ను
  5. A B. పాండ్య మొదలగు
  6. A B. కాడ
  7. A B. న్ను
  8. A B. న్ను
  9. A B. న్ను
  10. A B. వీరక్షేత్రాణో
  11. A B. న్ను
  12. A B. న్ను
  13. A B. న్ను
  14. V.V.C., A. B తోటి
  15. A. చల్లునే