పుట:వెలుగోటివారి వంశావళి.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


వా లావనితల తొడవుల
కీలా? రేచర్లరుద్రకీర్తిసముద్రా.

19


మ.

ఒగి నుక్కుంబొడి రాల రాయుదురు మున్నుద్గ్రీవులై[1] యిప్పుడున్
దగ నీయందియ[2]యదు నుండి తలక్రిందై వైరిభూపాలకుల్
జగతీభాగమునం బసిండిపొడి రాలన్ రాయుచున్నా రటే
తగదే రాయపితామహాంక జగభద్రా రుద్ర నిం జెందినన్.

20


వ.

అందు దామానేఁడు సంతతికి మొదలు.

21


క.

అతనికి ననేకతనయులు
మతిమంతులు పుట్టి రఖలమాన్యులు విజయో
న్నతులున్ నుతులును జతురులు
నతులితజగదవనకృతిమహాత్ము లనంగన్.

22


ఉ.

వారలలోనఁ జాల[3] ననివార్యపరాక్రము లిద్ద ఱన్వయో
ద్ధారులు దానశూరులు నుదాత్తమనోహరకీర్తిహారులున్
భూరిరిపుప్రతాపులును బుణ్య వీహారులు నిర్వికారులున్
వీరులు నై చెలుగి రిల[4] వెన్నమనాయక సబ్బినాయకుల్.

23


వ.

అం దగ్రజుండు.

24


శా.

సన్నద్ధప్రసరత్తురుష్కపృతనా[5]సందోహనిర్మూలనో
త్పన్నానూనయశుండు[6] విక్రమకళాపారీణదోస్సారుఁ డ
చ్ఛిన్నానేకసమిత్తురంగ[7]విజయశ్రీభోగసౌభాగ్యసం
పన్నుం డున్నతకీర్తి వెన్నధరణీపస్వామి సామాన్యుఁడే.

25


ఉ.

ఉన్నతబాహుసారమహిమోద్యతగోత్రు[8] డనంతభోగసం
పన్నవిహారుఁ డార్తభయభంజనదక్షసుదర్శనుండు వి

  1. A మున్ను గ్రీవులై, B. మున్ను శ్రీవులై.
  2. V. Rao (AC II P 29) A. B. డొ । ప్పుగ నీయండియ
  3. A. B వాల
  4. A. B వీరులు నై ధరం బరగి రెన్నను V V C వీరులు నై చెలంగు నల
  5. V V C; A. B. సన్నద్ధప్రధనస్తురుష్కప్రతనా
  6. V V C; A B త్పన్నప్రడ్గయశుండు.
  7. A. B. సమిత్తరంగ
  8. V V C మహితోద్యతగాత్రుఁడు, A. మహిమోద్యగాత్రుడు B. మహిమోన్నతమాత్రుడు.