పుట:వెలుగోటివారి వంశావళి.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


ద్వన్నుతవిక్రమాంకుఁడు నుదాత్తయశుండు[1] రమాసమేతుఁ డై
వెన్నుఁడు వోలె సొం పెసఁగె వెన్నయభూపతి వైభవోన్నతిన్.

26


వ.

ఆ వెన్నమనాయనికిని జాయమదేవులకును[2] నెఱదాచానేఁడు పుట్టెను.

27


క.

ఆయతకీర్తి న్వెన్నమ
నాయకునకు నెఱ్ఱదాచనరనాయకుఁడున్
ధీయుతుఁడు సబ్బిఘనునకు
నాయకమణి నల్లదాచనరపతి పుట్టెన్.

28


క.

ఆ నల్లదాచవిభునకు
మానితగుణశాలి యైన మాధవవిభుఁడున్
ధీనయవిశ్రమసంపద
భూనుతిఁ గల గామవిభుఁడుఁ బుట్టిరి వరుసన్.

29


వ.

సంతతికి వెన్నమనేఁడు మొదలు.

30


ఉ.

వాలని విక్రమస్ఫురణ వారలు పాండ్యదళంబు దంతులన్
గేళి జయించి పాండ్యగజకేసరినామము దాల్చి రెంతయున్
జాలినవారు నా నెగడి[3] సన్నుతిఁ గాకితరాజ[4]రాజ్యల
క్ష్మీలలనాప్రతిష్ఠఁ దగఁ జేసిరి భూజను లెల్ల మెచ్చఁగన్.

31


వ.

మఱియును[5] నెఱదాచానేని ప్రతాప మెట్టి దనిన.

32


శా.

అగ్రీభూతమదాంధశాత్రవనికాయంబున్ విభాళించుచో[6]
వ్యగ్రోదగ్రసమగ్రనిగ్రహగుణోద్యత్ప్రౌఢి[7] నారూఢుఁడై
యుగ్రాజిస్థలి దాచనాయకుఁడు కుంట్లూరిమ్మడిం జంపి భూ
తగ్రాసం బిడె గొల్లపల్లి బయలన్ దర్పప్రతాపోన్నతిన్.

33
  1. A. B. విక్రమార్కుడు వు(వ)దాతయశుండు. V.V.C విక్రమార్కుఁడు నుదారయుశుండు
  2. A. B. నాయనికిన్ని; దేవులకున్ను.
  3. V. Rao వారుగా నెగడి (Ac 11), A.B వారనా నెగడి.
  4. V. Rao (Ac 13), కాకతిరాయ.
  5. A. B. మరిన్ని
  6. A. విబాళించుచో B. బాలించుచో. V.V.C. విభంజించుచో.
  7. V.V.C. A B గుణాఢ్యప్రౌఢి.