పుట:వెలుగోటివారి వంశావళి.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


వాడు[1] రిపురాజపన్నగ వైనతేయుఁ
డాజివిజయుండు కేళాదిరాజఘనుఁడు[2]
భాసురుం డగు[3] రేచర్లశాసనుండు
నిత్య సత్యుండు నాప్రసాదిత్యఘనుఁడు[4].

16


ఉ.

నారికి నాత్మవల్లభుని నారియకా నొనరింప బ్రహ్మయున్
నేరఁడు రుద్రమాంబ ధరణీసతికిం బతిగా నొనర్చి దు
ర్వారవిరోధిమండలము వాఁడిమి డించితి[5] వౌర మేటి వై
వీర ప్రసాదితాంక హరివిక్రమ నీకొరు లీడె చూడఁగన్[6].

17


వ.

[7]ఆప్రసాదిత్యుఁడు కాకతి గణపతిదేవరాయలు చనిన, నతని కొమరిత
రుద్రమదేవిని బట్టముఁ గట్టి కాకితరాజ్యస్థాపనాచార్య బిరుదును, రాయ
పితామహాంక బిరుదునుఁ [బొంది] డెబ్బదియేడ్గురు నాయంకులఁ దా నొన
ర మించి[8] భైరవప్రసాదలబ్ధం బగు పచ్చ ధరియించి నెగడె మహిని. అతని
యనుజుండు.

18


క.

వా లనిఁ బెఱికినఁ బరభూ
పాలస్త్రీభూషణములు పాసి పడును నీ

  1. V V C The original has అతడు.
  2. A. B. రాజితం బైన కేళాదిరాయఘనుఁడు, this has been corrected by the editors of the V V C as వైనతేయుఁ, డాజివిజయుండు కేరళరాజఘనుఁడు.
  3. V V C భాసురయశుండు; A. B. భాసురంబగు.
  4. V V C సత్యసంధుడు సత్ప్రసాదిత్య, A B నిత్యసత్యుండుయా.
  5. V V C దుర్వారవిరోధి భూపనికరంబు నడంచి యతండు వెండియున్. A. B. మండలిని గర్వమణంచి.
  6. V V C వీరప్రసాదితాంక హరివిక్రముడంచుఁ బొగడ్తకెక్కెఁ దాన్. A. ప్రసాయతాంక అరి B. ప్రసాయతాంక నరి.
  7. The colloquial forms చనితె, కుమార్తె, బిరుదున్ను, and డెబ్బై which occur
    in this passage have been corrected. V V C quotes the following
    verse here. The source from which it has been taken is not known.
    ఘనత నాప్రసాదిత్యుఁడు కాకతి గణ । పతి చనిన నతని సతికిఁ బట్టనంబు
    రమణతోఁ గట్టి కాకతిరాయరాజ్య । స్థాపనాచార్య బిరుదు దాఁ దనరఁ గాంచె.
    This appears to be a recent interpolation.
  8. A.B. నాయంకులుగా నొనరించి