పుట:వెలుగోటివారి వంశావళి.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


సీ.

చటులఖడ్గాఖడ్గిసమరప్రవీణుఁడై
        ఖడ్గనారాయణఖ్యాతి నొందె
రణపరాఙ్ముఖరాజరమను జే[1]కొని రాయ[2]
        గాయగోవాళాంకకలితుఁ డయ్యె
నాభీలవైరిగజాళికాయంబులు[3]
        భేదించి భుజబలభీముఁ డయ్యెఁ
బ్రథితారిరాజన్యభయదవిక్రమమునఁ
        బ్రతిగండభైరవప్రథ వహించె
మఱియుఁ బెక్కైన బిరుదనామములఁ దనరి
బాహువిక్రమదాన సంపదలతోడఁ
దనరి యొప్పారె నంచితోద్దామయశుఁడు
భువనహితకారి యగు దామభూవిభుండు.

15


సీ.

యలమి డెబ్బదియేడ్గురైన [4] నాయకులలోఁ
        బటుప్రతాపస్ఫూర్తిఁ బరఁగినాఁడు
చండభుజాబలోద్దండక సి యై
        దండితారాతులఁ జెండినాఁడు[5]
ఏపున నోర్గంటి [నే]లు ప్రతాపుచే[6]
        నందెయుఁ బెడెంబు నందినాఁడు
విక్రమంబున ధరాచక్రంబులోఁ గల
        బిరుదులు దనవి గాఁ దిరిగినాఁడు

  1. V V C., A B లక్ష్మి
  2. రాయ has been added by the editors of V V C to complete the line.
  3. V V C, ఆజిబలాధికుఁడౌటచే నెంతయు; A B గజాధికారంబులు
  4. A. B. యలవి డెబ్బాదేడ్గురైన; ఎ does not rhymd with ఐ, but the correct form of the word is ఎలమి and not యలమి. To make the line strictly conform to the rule of the Telugu prosody, the editors of the V V C corrected the line thus ధరణిపై డెబ్బదేడ్గురు. But as the word is spelt throughout the work as యలమి, I have retained the reading of the Mss.
  5. V V C చండభుజాదండమండితారాతుల భండనంబునఁ జాలఁ జెండినాఁడు
  6. V V C ఏపుననోర్గల్లు నేలు రుద్రునిచేత, A. B యేపున నోరుగంటిప్రతాపునిచే